ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్..మహారాష్ట్రలో పొలిటీషియన్‌గా ఎలా ఎదిగిందో చూడండి


రాజకీయాలు, సినిమా రంగం రెండూ జనంలో గుర్తింపు తెచ్చిపెట్టేవే. ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా ముందు సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది. చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. ఆమే నవ్‌నీత్ కౌర్ ముంబై నుంచి వచ్చిన ఈ పంజాబీ బ్యూటీని సాలిడ్ పర్సనాలిటీగా ఇండస్ట్రీలో వర్ణించేవారు. 2004లో దర్శన్‌ అనే కన్నడ సినిమా ద్వారా సినిమారంగంలోకి వచ్చిన నవ్ నీత్ కౌర్ సడన్‌గా సినిమాల్లో కన్పించడం మానేసింది.




ఎక్కడుందీ బ్యూటీ...మలయాళం, తమిళం, కన్నడం ఇలా ఏ భాషలో చేస్తుంది ఇప్పుడు సినిమాలు అని వెతికినవారికి నిరాశే మిగిలింది. ఐతే సీన్ అక్కడ కట్ చేసి చూస్తే..ఆమె ఇప్పుడు ఓ పొలిటీషియన్.. అంతే కాదు గత లోక్ సభ ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ‌ తరపున ఎంపిగా పోటీ చేసింది. ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా సాధ్యపడిందీ అని తరచి చూస్తే..దానికి కారణం ఆమె పెళ్లి అని చెప్పాలి.


2011 ఫిబ్రవరి 3న రవి రానా అనే ఎమ్మెల్యేతో నవ్ నీత్ కౌర్‌కి పెళ్లైంది. మహారాష్ట్రలోని బద్నేరా అనే నియోజకవర్గం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇతను. ఇలా ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇతను రెండోసారి. అమరావతి జిల్లాలో ఇతనికి మంచి పేరు ఉంది.




తన నియోజకవర్గంలో జరిగే సామూహిక వివాహాలలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగడం మరో విశేషం. రవిరానా ఎంత ఘటికుడంటే సాక్షాత్తూ బిజెపి అధిష్టానానికే హెచ్చరికలు జారీ చేయగలడు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కనుక పదవి నుంచి తప్పిస్తే సపోర్ట్ వెనక్కు తీసుకుంటామని గతంలో వార్నింగ్  ఇచ్చాడు. ఇంత పవర్ ఫుల్ లీడర్ ఓ హీరోయిన్ ప్రేమలో ఎలా పడ్డాడనేది ఇంట్రస్టింగ్ గా అన్పించవచ్చు అదెలా జరిగిందంటే నవ్ నీత్ కౌర్‌కి యోగా చేయడం అలవాటు. అందుకోసం ఆమె రామ్ దేవ్ యోగా ట్రైనింగ్ క్లాసులకు హాజరు అవుతుండేది..అక్కడే రవి రానా పరిచయం అయ్యాడట. అలా అది ప్రేమకి దారి తీయగా...రవి రానాతో పెళ్లి నవ్ నీత్ కౌర్ కెరీర్‌‌కి బ్రేక్ వేసింది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. పెళ్లి అయ్యేనాటికి కూడా నవ్ నీత్ కౌర్ సినిమాలు చేస్తుండేది. తెలుగులో శీను వాసంతి  లక్ష్మి, వడ్డే నవీన్ శత్రువు, జగపతి, గుడ్ బాయ్, రూమ్మేట్స్, మహారధి, యమదొంగ, బంగారుకొండ, భూమాలో నటించింది. 2009 తర్వాత పంజాబీ సినిమాల్లో నటించడం ప్రారంభించిందామె




అలా తెలుగువారికి దూరమై, ఉత్తరాదిన నటించడం ప్రారంభమైన సందర్భంలోనే రవి రానాతో పరిచయం కలగడం పెళ్లి అవడం జరిగిపోయాయ్. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2014లోనే అమరావతి లోక్ సభ నియోజకవర్గంనుంచి ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసింది నవ్ నీత్ కౌర్ ఐతే ఓటమి పాలవడంతో భర్త నియోజకవర్గమైన బద్నేరాలో రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. తెలుగు సినిమాల్లో తన అందంతో ఆకట్టుకున్న  ఈ భామ మహారాష్ట్ర పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం ఆసక్తి కలిగించే విషయమే కదా..








Comments