హరికృష్ణని ఎన్‌టిఆర్ ఆత్మే వెంటాడిందా..ఎందుకీ ప్రచారం

నందమూరి కుటుంబాన్ని అందులోనూ హరికృష్ణ కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఐతే ఇందులో వీళ్ల నిర్లక్ష్యమూ లేకపోలేదు. ఐతే ఎన్టీఆర్ ఆత్మే ఇలా వెంటాడుతుందని అల్లరిమూక ప్రచారం చేయడం దురదృష్టకరం.
నందమూరి హరికృష్ణ టిడిపికి అభిమానులకు మధ్య ఓ వంతెన. మిగిలిన సోదరులు పార్టీతోనే ఉన్నట్లు కన్పించినా, ఆవిర్భావం నుంచి చివరి వరకూ పార్టీతో అనుబంధం ఉన్నది హరికృష్ణ ఒక్కరికే. ఎన్టీఆర్ చైతన్యరధానికి సారధ్యం వహించడంతో మొదలైన రాజకీయ ప్రస్థానంలో సొంతంగా పార్టీ పెట్టడం వరకూ ఎదిగారాయన. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసిన ఎపిసోడ్‌లో కుటుంబం నుంచి వ్యతిరేకత రాకుండా కాపు కాసింది హరికృష్ణనే. ఐతే ఆయనకి ఓ మంత్రి పదవి పారేసి ఆ తర్వాత లాక్కున్న ఘనత మాత్రం చంద్రబాబుదే.

టెన్త్ కూడా పూర్తి కాని హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పంపినట్లే పంపి పార్టీపై పట్టు నిలబెట్టుకున్నది కూడా చంద్రబాబునే. ఓ రకంగా ఈ రాజకీయంతోనే హరికృష్ణ పార్టీకి దూరంగా..కుటుంబానికి కూడా దూరంగా అయ్యారన్నది వాస్తవం. బాలకృష్ణ వియ్యంకుడిగా చంద్రబాబు మారిన తర్వాత  ఈ దూరం ఇంకా పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌ని కుటుంబం దూరం పెట్టినా కూడా హరికృష్ణ పార్టీకి,కుటుంబానికి దగ్గరగానే మెలిగారు, కానీ ఆ తర్వాత మాత్రం వాస్తవాలు గ్రహించి టిడిపికి, మిగిలిన కుటుంబసభ్యులకు ముఖ్యంగా బాలకృష్ణకు దూరంగా ఉండటం ప్రారంభించారు.
 తన కొడుకు జానకీరామ్ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోవడంతో కుంగిపోయిన హరి..ఆ తర్వాత ఎక్కడా కోలుకున్నట్లు కన్పించలేదు. తన మనవళ్లుకు పంచెలు ఇస్తున్నప్పుడు, ఇతర  సందర్భాలలో తీవ్రంగా భావోద్వేగాలకు లోనయ్యేవారు. మనిషి కూడా బాగా చితికిపోయి..చివరికి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఐతే ఎన్టీఆర్‌కి చేసిన ద్రోహమే ఆయన్ని వెంటాడిందని..జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి , జానకీరామ్ మరణానికి ఎన్టీఆర్ ఆత్మే కారణమనే బూటకపు ప్రచారం అప్పట్లో సాగింది.

 ఇప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం సాగుతోంది. ఎక్కడైనా తండ్రి పుత్రులను ప్రేమిస్తారు కానీ ఇలా వెంటాడి వేధించరు. ఇది తెలిసినవారు మాత్రం నందమూరి ఫ్యామిలీని నిర్లక్ష్యమే వెంటాడుతుంది తప్ప మరోటి కాదని విశ్లేషిస్తున్నారు

Comments

  1. ఇలాంటి పనికిమాలిన రూమర్స్ ప్రచారం చేయడం నిజంగా దురదృష్టమే.....

    ReplyDelete

Post a Comment