స్టాలిన్ సంగతి సరే మరి మిత్రుడు రజనీకాంత్ ఏమవ్వాలి భక్తవత్సలం

నటుడు మోహన్ బాబు ఇప్పుడో సందిగ్ధావస్థలో ఉన్నారు. అటు తన సినిమాలు హిట్ అవ్వడం లేదు, అసలు తనకి ఎలాంటి పాత్రలు నప్పుతాయో కూడా ఎంచుకోలేని స్థితిలో ఉన్నాడాయన. అలాగని నటనని వదిలిపెట్టి తన స్కూల్ విషయాలకు మాత్రమే పరిమితం అవ్వాలనుకునే మనిషి కూడా కాదాయన. తన కొడుకుల పరిస్థితి కూడా అంతే..ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా..పాపం సరైన హిట్ ఒక్కటి లేదు. ఖచ్చితంగా పది సెంటర్లలో వంద రోజులు ఆడిన సినిమాలు లేవు ఇద్దరు కొడుకులకు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో రాజకీయాల్లోనూ తన లక్ టెస్ట్ చేసుకునేందుకు చాలాసార్లు ట్రై చేసినా..అందుకు తగ్గ అవకాశం దక్కడంలేదు.
ఐతే ఈ మధ్య ట్విట్టర్లో మాత్రం తన పోస్టులతో అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తాను కొత్త తరానికి తగ్గట్లు మారానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడాయన.  ఇవాళే స్టాలిన్ డిఎంకేకి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత  సోదరా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందంటూ ట్వీట్ చేశాడు

కరుణానిధి సంస్మరణ సభలకు మోహన్‌బాబుకి ఆహ్వానం అందడంతో కోయంబత్తూరుకు కూడా వెళ్లొచ్చాడట మోహన్ బాబు. ఇందుకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ట్వీట్ చేశాడు మోహన్ బాబు ఉరఫ్ భక్తవత్సలం నాయుడు. ఐతే ఇక్కడే మోహన్ బాబుని బాగా ఎరిగినవాళ్లు ఓ సందేహం లేవనెత్తుతున్నారు. మరి నీ మిత్రుడు రజనీకాంత్ పరిస్థితి ఏంటి..? ఆయన కూడా పార్టీ పెట్టాడు..వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు.(అని రజనీనే ప్రకటించాడు కదా) మరి అలాంటప్పుడు స్టాలిన్‌ని సిఎంగా చూడాలని ఉందంటే రజనీకి కోపం రాదా..పోన్లే సరదాగా అని ఉంటావని సరిపెట్టుకోమంటావా..ఎందుకంటే రజనీకాంత్ ఎలాంటి మిత్రుడో మోహన్ బాబే స్వయంగా చాలాసార్లు చెప్పుకొచ్చారు. 

పార్టీ ప్రకటన తర్వాత కూడా మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులతో వెళ్లి రజనీకాంత్‌ని కలిసి వచ్చారు. రాఖీ పండగలకు రజనీకాంత్ వైఫ్ శ్రీలత మోహన్‌కి రాఖీలు కడుతుంటుంది. అయినా  ఈ చిన్న విషయాన్ని ఎందుకు మోహన్‌బాబు ఎందుకు మర్చిపోయి ఉంటారబ్బా..బహుశా తమిళనాడులో ఇప్పుడప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావనా...?

లేదంటే తన కొడుకు మనోజ్‌కి కనీసం తమిళనాడులో అయినా కొద్దిగా బేస్ ఏర్పాటు చేసే దూరదృష్టితో ఇలా కామెంట్ చేశారా అని గుసగుసలు విన్పిస్తున్నాయ్. 




Comments