బాలకృష్ణ-విజయశాంతిల మధ్య అనుబంధానికి నిదర్శనం ఈ 17 సినిమాలు


ఒకప్పుడు ఈ ఇద్దరూ తెరపై కన్పిస్తే ఫ్యాన్స్ తెగ కేరింతలు కొట్టేవాళ్లు..అప్పట్లోని పామరజనం తెరపై హీరోహీరోయిన్లంటే నిజజీవితంలోనూ అలానే ఉంటారేమో అన్నట్లుగా మాట్లాడుకునేవారు.అలా ఆడియెన్స్ మదిలో ముద్ర వేసిన జంటల్లో బాలకృష్ణ-విజయశాంతి ఒకటి.వీరిద్దరూ 1984 నుంచి 1993 వరకూ కలిసి నటించారు..వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉంటే కొన్ని అట్టర్ ఫ్లాపులు ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కనబెడితే ఈ ఇద్దరూ హిట్ పెయిర్‌గా ప్రేక్షకులకి గుర్తుండిపోయారు.


1984లో మొదటగా వీరు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన కథానాయకుడులో నటించారు. కే మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఆ సినిమా హిట్. తర్వాతి ఏడాదిలో పట్టాభిషేకం, ముద్దులకృష్ణయ్యలో బాలయ్య విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు పట్టాభిషేకానికి కే రాఘవేంద్రరావ్ డైరక్షన్..ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ముద్దుల కృష్ణయ్య మాత్రం సూపర్ హిట్. 1986లో దేశోధ్దారకుడు, అపూర్వసహోదరులు, భార్గవరాముడులో వీరిద్దరూ తెరపంచుకున్నారు. మళ్లీ 1987లో మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడులో బాలయ్య, విజయశాంతి కలిసి చేశారు. 1988లో మాత్రం భలేదొంగ అనే ఒకే ఒక సినిమాలో మాత్రమే నటించారు. ఇది యండమూరి రాసిన కథతో దేవీవరప్రసాద్ వేరే బ్యానర్ పై నిర్మించిన సినిమా.





జనరల్ గా ఆయన దేవీ ఫిలింస్ పై ఎన్టీఆర్, చిరంజీవితో మాత్రమే తీస్తారు. 1989లో బ్లాక్ బస్టర్ మూవీ ముద్దుల మావయ్యతో విజయశాంతి బాలయ్య ప్రేక్షకులని ఓలలాడించారు. తర్వాతి సంవత్సరంలో మాత్రం వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. 1991లో మళ్లీ వరసగా ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు అని మూడు సినిమాలలో కలసి నటించగా..ఈ మూడు వరసగా విడుదల కావడం విశేషం. వీటిలో లారీ డ్రైవర్ హిట్..తల్లిదండ్రులు యావరేజ్. ఆ తర్వాత రౌడీ ఇన్ స్పెక్టర్ కూడా సూపర్ హిట్.
వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ..



ఇది విజయశాంతి సొంతంగా నిర్మించారంటారు..మీకెక్కడా నిర్మాతపేరు కన్పించదు. యువరత్న ఆర్ట్స్ బ్యానర్‌ మాత్రమే కన్పిస్తుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తెరపై కాదు కదా..నిజజీవితంలోనూ ఎక్కడా తారసపడలేదు. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు విజయశాంతి ఎంపిగా ఉన్నా..బాలయ్య రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు ఇద్దరూ పాలిటిక్స్‌లోనే ఉన్నా కలిసే సందర్భమే లేదు. ఎప్పటికైనా మళ్లీ ఈ జంట కలిసి తెరపై కన్పిస్తే చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఆశపడుతుంటారు. చూద్దాం ఆ ఆశ నెరవేరుతుందేమో..

Comments