హే..శివాజీ చెప్పింది ఈ నోటీసుల గురించేనా..


అప్పుడప్పుడు అంబపలుకు జగదంబ పలుకు..అన్నట్లుగా వచ్చిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టివి9 సౌజన్యంతో
లైవ్‌లు ఇచ్చి పరిగెత్తుకుంటూ పోయే శివాజీ మొన్నామధ్య బాగా హడావుడి చేశాడు.."చంద్రబాబుకి ఓ రాజ్యాంగబద్ద సంస్థ నుంచి సోమవారం నోటీసులు రాబోతున్నాయూ..".అంటూ పైగా ఆ ప్లేస్‌లో జగన్ ఉన్నా ఇంతే ఆందోళన పడతా అనే మాట కూడా అన్నాడతడు..ఆయన ఉద్దేశంలో అసలు ఆపరేషన్ గరుడ బిజెపివాళ్లకి శివాజీకి తప్ప ఇఁకొక్కళ్లకి తెలీదని..సరే ఆ మాట నిజమే అనుకున్నా..ఆయన ఉద్దేశంలో చంద్రబాబుకి నోటీసులు అనేవి ఎవరూ ఇవ్వకూడదు. ఇస్తే అది రాష్ట్రానికే అరిష్టం..అసలు కేసు కూడా ఎవరూ కనీసం పెట్టకూడదు..పెడితే అది దేశద్రోహం అన్నరీతిలో ఆయన ప్రసంగం సాగుతుంది.

సరే..నాలుగు రోజులు గడిచాయి..నోటీసులు రాలేదు అనుకుంటుండగా..ఇవాళ ధర్మాబాద్ కోర్టు నోటీసులు రావడం జరిగింది. అంటే శివాజీ  బాధపడిపోయిన నోటీసులు ఇవేనా...!? ఇలాంటి నోటీసులు ఎన్ని వస్తే ఏంటి..? ఎందుకంటే సిఎం కేసీఆర్‌కి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఇలాంటి నోటీసులు చాలాసార్లు సీమాంధ్రులను తిట్టాడంటూ కేసులు పెడితే వచ్చాయి. ఆ మాత్రానికి ఆపరేషన్ గరుడ అంటూ గింగిరాలు తిరిగిపోవాలా...? సరే ఇలా ఓపెన్‌గా కోర్టునోటీసులు పంపితే, దానికి ఆపరేషన్ గరుడ అంటూ వేరే అర్ధాలు తీస్తే..శివాజీ కోర్టు ధిక్కారనేరం కింద ఎన్ని రోజులు జైల్లో గడపాల్సి వస్తుందో మరి? ఎందుకంటే కోర్టులు ఇదివరకటిలా ఎవరేమన్నా ఊరుకోవడంలేదు..వచ్చి సంజాయిషీ చెప్పి మరీ కదలాల్సిందే.
అయినా నాన్ బెయిలబుల్ వారంట్ ఎందుకు ఇచ్చిందీ కోర్టు  రేపు చంద్రబాబుకి చెప్తుంది. అయినా హైకోర్టుకో..సుప్రీంకోర్టుకో వెళ్లి స్టే తెచ్చుకోగల సామర్ధ్యం ఉంది. లేదూ నారా లోకేష్ చెప్పినట్లు నోటీసులు వస్తే హాజరవుతారు.  అయితే  ఇక్కడ లోకేష్ స్టేట్ మెంట్ మరీ విచిత్రంగా ఉఁది. చంద్రబాబు బెయిల్ కూడా నిరాకరించారు అఁటారేంటి అక్కడేంటో అరెస్ట్ అయినట్లు..సింపుల్ గా పోయే నోటీసులకు ఇలా భారీ డ్రామా అవసరమా?

Comments