ఇండస్ట్రీలో ట్రెంట్ సెట్టర్ కి పని చేశాడు..ఫుట్ పాత్ పై పడుకుంటున్నాడు. ఇతని జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఇదే


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కొన్నే ఉఁటాయ్. ఆ తర్వాత అదే కోవలో చాలా సినిమాలు వస్తుంటాయ్. కానీ ఆ మొదటి సినిమాలను మాత్రం చాన్నాళ్లు ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. ఆ సినిమాలతోనే కనీసం ఓ ఇరవైమంది సెలబ్రెటీలుగా ఎదుగుతారు. అలా శివ సినిమా సృష్టించిన సంచలనంతో నాగార్జున, అమల, రామ్ గోపాల్ వర్మ, జేడీ చక్రవర్తి, రఘువరన్, ఉత్తేజ్ ఇలా చాలామంది తమ పునాదులు పదిలం చేసుకున్నారు.
ఐతే  ఇదే సినిమాకి పని చేసిన  ఎడిటర్ సత్తిబాబు మాత్రం తెరమరుగు కావడంతో పాటు..జీవనం సాగించలేక కేరాఫ్ ప్లాట్ ఫామ్ అయ్యాడు. ఇది కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తే..అయితే సినిమారంగం విచిత్రమైనది..వచ్చిన సక్సెస్ నే పట్టించుకుంటుంది కానీ..పరాజయాల్లో  ఉన్నవారిని ఎంతో కాలం ప్రోత్సహించలేదు. దీనికి తోడు వ్యక్తిగత బలహీనతలు కూడా కెరీర్ ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే టాలెంట్ తో పాటు నిరంతరకృషి, అదృష్టం ఉంటేనే సినిమా కెరీర్ కొనసాగించగలుగుతారు. ఓ యూట్యూబ్ ఛానల్, మరో చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు సత్తిబాబుకి అండగా నిల్చింది. ఐతే ఇలా అండగా నిలిచినంత మాత్రాన ఆయనకి అవకాశాలు వెల్లువలా వస్తాయనుకోవడం భ్రమ. ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్త రక్తం ఉరకలు వేస్తుంటే పాతవైపు చూడరు. ఉపాధి కలిగించడం వరకూ చేయడం గొప్పే అయినా..కాలానికి తగ్గట్లుగా ఎవరైనా మారాల్సిందే. లేకపోతే సెలబ్రెటీ స్టేటస్ కరిగిపోయి రోడ్డున పడాల్సి వస్తుంది. డాన్స్ మాస్టర్ సలీం, విలన్లు రాజనాల, నాగభూషణం అలా తమ చివరిదశలో అగచాట్లు పడ్డవారే. ఆర్దికంగా సరైన క్రమశిక్షణ లేకపోతే ఏం జరుగుతుందో వీరి జీవితాలను చూసి నేర్చుకోవాల్సిందే. అంతే తప్ప వారికి ఆ హీరో సాయపడలేదు..ఈ డైరక్టర్ సాయపడలేదు అని విమర్శలు చేయడం అనవసరం. ఎఁదుకంటే,  ప్రతివారి జీవితాలను బాగు చేసే ఓపిక ఈ రోజుల్లో ఉండదు. అలా చేసుకుంటే పోయారు కాబట్టే కొంతమంది చివరికి వాళ్ల చేతుల్లో చిప్ప మిగుల్చుకున్నవారు ఉన్నారు. కన్నాంబ, చిత్తూరు నాగయ్యలాంటి వారు ఇందుకు ఉదాహరణ. ఎవరి జీవితాల్లో వారు ఎలాంటి తప్పులు చేసారో వాటిని సరిదిద్దుకోవాలే తప్ప సెలబ్రెటీలు అయినంత మాత్రాన జీవితాంతం ఇంకొకరు సాయం చేయాలని చూడటం అవివేకం. 

Comments