అరెస్ట్‌ల వరసలో కేసీఆర్ ఇన్ డైరక్ట్ సిగ్నల్ ఏంటి



తెలంగాణలో ఇప్పుడు రోజుకో అరెస్ట్ సంఘటన కలకలం రేపుతోంది.  ఎన్నికలకు ముందు నుంచి విపక్షాలు తమ వారిపై కేసులు పెడుతున్నారని అధికారపక్షంపై ఆరోపణలు చేయడం మామాూలే. కానీ ఈసారి ముందస్తుతో పాటు ముందు వరసలో ఉండే లీడర్లనే అరెస్ట్ చేస్తుండటం విస్తుపోయే విషయమే. జగ్గారెడ్డ ి విషయమే చూస్తే..ఈ కేసు ఇప్పటిదికాదు..పైగా 2002-04 మధ్యలో టిఆర్ఎస్ ముఖ్యలీడర్లపైనే ఇలాంటి ఆరోపణలు వచ్చాయ్. అలాంటిది ఇప్పుడు తూర్పు జయప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం విడ్డూరం. అయితే ఆయన్ని కలవడానికి వెళ్తోన్న దామోదర రాజనర్సింహని అరెస్ట్ చేయడం కూడా మరో దుందుడుకు చర్యే.

జూబ్లిహీల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఒక్కడేనా దోషి..? ఆయనకి నోటీసులు ఇవ్వడంతో పాత తుట్టని కదుపుతున్నట్లే..ఎందుకంటే ఈ కేసులో సరిగా ఎంక్వైరీ చేస్తే..పేరుగొప్ప  ఊరుదిబ్బ ఛానళ్ల ఓనర్లు కూడా బొక్కలోకి పడకతప్పదు.  తర్వాతి అరెస్ట్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్..ఇతగాడు ఎప్పట్నుంచో తన నోటిని అదుపులో పెట్టుకోలేని వ్యాధితో బాధపడటం నిజమే అయినా...ఆగస్ట్ 15న ర్యాలీ చేస్తే ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం ఏంటి. సందట్లో సడేమియాలాగా ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కారామయ్యని అరెస్ట్ చేయడం కూడా వీటి లెక్కలోనే విపక్షాలు కలిపేస్తున్నాయ్. ఇది రోజూ జరిగే తంతే కావచ్చు.

 కానీ ఇలాంటి పరిణామాలన్నీ కలిసి కేసీఆర్ కి ఓ ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయ్. అది ఆయనలో భయం కలిగిందనే సంకేతం  ఇస్తున్నాయ్. ఐతే ఇలాంటి కేసులు పెట్టినందువలన భయపడేది ఎవరూ లేదు. ఎందుకంటే పాలిటిక్స్‌లో అందులోనూ ఇప్పటి రోజుల్లో జైల్లో పడితే ఓట్లశాతం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇది తెలిసీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందన్నది తెలియాలి. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఇద్దరూ ఇటీవల ఓ సభలో కేసీఆర్‌పై ఏకవచన ప్రయోగం చేసారు...నువ్ కాకపోతే నీ వారసులనైనా బొక్కలో వేస్తా అని రేవంత్ రెడ్డి, నే తొడగొడితే గుండె ఆగి చస్తావ్ అని జగ్గారెడ్డి రెచ్చిపోయారు..ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నందునే వీరికి కేసులు, అరెస్ట్‌లు మొదలు అయ్యాయని టాక్ నడుస్తోంది.

Comments