కెప్టెన్ రాజు తెలుగు ఇండస్ట్రీకి ఎలా దగ్గరో తెలుసా


బహుముఖనటనాశాలి అంటే నిజమైన నిదర్శనం కెప్టెన్ రాజు. తాను సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి దాదాపు అవకాశం వచ్చిన ప్రతిసారీ నటిస్తూనే ఉన్నాడాయన. ఆయన చివరిక్షణాలు కూడా సినిమాటిక్‌గా ముగియం గమనించాలి. కొచ్చి నుంచి న్యూయార్క్ వెళ్తోన్న ఫ్లైట్‌లో ఉండగానే ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో పైలెట్లు విమానాన్ని మస్కట్‌లో ఆపివేశారు. హుటాహుటిన ఆయనకి అక్కడే చికిత్స అందించగా..కోలుకున్నారు. కానీ మస్కట్ నుంచి తిరిగి ఆయన స్వస్థలం కొచ్చికి తీసుకువచ్చిన తర్వాతే చనిపోయారు. సొంత ఇంట్లో సెప్టెంబర్ 17న కెప్టెన్ రాజు కన్నుమూశారు. కెప్టెన్ రాజు అనగానే తెలుగువారు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. తెలుగులో నటించి 20ఏళ్లైనా ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే ఆయనతో ప్రత్యేక అనుబంధమే కారణం. ఆయన తొలి సినిమా బలిదానం..శోభన్ బాబు హీరో.

మద్రాసులో తెలుగు సినిమా షూటింగ్స్ జరిగే రోజుల్లో కెప్టెన్ రాజుని చూసి తన సినిమాకు విలన్ గా చేయమని అడిగారు. అలా ఆయన పరిచయంతోనే తెలుగులో పరిచయంఅయ్యారు. కేరళలో పుట్టిన డానియేల్ రాజు 21 ఏళ్లకే ఆర్మీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ స్థాయికి చేరారు. అప్పట్నుంచే ఆయనకి సినిమాల్లోనూ అదే పేరు ఖరారు అయింది. అలా 500 సినిమాల వరకూ నటించిన కెప్టెన్ రాజు తెలుగులో బలిదానం తర్వాత మరణశాసనం లాంటి సినిమాలు..డబ్బింగ్ సినిమాలతోనూ పలకరించేవారు. ఐతే శత్రువు సినిమాతో మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. తెలుగువారిలో వెంకటేష్ అన్నా..కోట శ్రీనివాసరావు అన్నా..కోడి రామకృష్ణ అన్నా ఆయనకి బాగా గౌరవం. మాతో పెట్టుకోకు, కిల్లర్, రౌడీ అల్లుడు, మొండి మొగుడు పెంకి పెళ్లాం, రౌడీ ఇన్స్ పెక్టర్, లారీ డ్రైవర్, గాండీవం, కొండపల్లిరాజా వంటి అనేక సిినిమాల్లో నటించారు.  మధ్యనే అంటే 2018 జులైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన ఫస్ట్ తెలుగు డైలాగ్ చెప్పడం ఆయన జ్ఞాపకశక్తికి తార్కాణం. నిలువెత్తు విగ్రహంతో కన్పించే కెప్టెన్ రాజు దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటారు. తెలుగు, తమిళ, మలయాళ కన్నడ అగ్రనటులతో ఢీ అంటే డీ అనేలా నటించి కెప్టెన్ రాజు 11 టివి సీరియల్స్ లో నటించారు. చిన్నతనంనుంచీ కెప్టెన్ రాజు తండ్రి ఆయన్ని ఓ చర్చ్ ఫాదర్‌గా చూడాలనుకునేవారట. కానీ విధి మాత్రం తనని నటుడిగా మార్చిందని కేరళలో ప్రతి చోటా చెప్పేవారట కెప్టెన్ రాజు. తొందర్లోనే మరో మంచి క్యారెక్టర్‌తో కన్పిస్తానని చెప్పిన కెప్టెన్ రాజు ఇలా కన్ను మూయడం సినిమా ప్రేమికులకు కలిచివేసింది



Comments