బురద జల్లితే ఎలా బాబూ...!


నాది ఫార్టీ ఇయర్స్ ఇఁడస్ట్రీ..నాకున్నంత అనుభవం ఎవరికీ లేదు..అన్నిట్లో నేనే ఫస్ట్..నో నో..వాటాయామ్ సేయింగ్ ఈజ్.. ఈ పదాలు వినగానే ఇది మన ముఖ్యమంత్రి మాటలు అని అర్ధమైపోతుంది. ఆయన ప్రసంగాన్ని నీట్ గా ఫాలో అయితే చాలు ఎలాంటి మాటలనైనా అలవోకగా తడుము కోకుండా చెప్తే చాలు అన్నీ నిజాలు చెప్పినట్లు
అనుకుంటారు అనిపిస్తుంది. ఏ టూర్ చేసి వచ్చినా దాని గురించి గంటలకొద్దీ ప్రసంగాలు విసిరేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా..చెప్పిందే చెప్పినా వినేవాళ్లకి బోర్ ఏమో కానీ..ఆయనకి మాత్రం దిగ్వుణీకృతమవుతుంది ఉత్సాహం.
ఇవాళ ఏం చేసినా నేనే..నక్సలిజం లేకుండా చేసానంటే నా గొప్పే..ఎవరైనా కాదనగలరా అంటూ చంద్రబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోకతప్పదు. ఎఁదుకంటే మావోయిస్టులు దాడి చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాదు..కనీసం పదేళ్లపాుటు అదికారానికి దూరంగా ఉన్నారు..ఈ మధ్యకాలంలోనే నక్సల్స్ కదలికలు ఏపీ తెలంగాణలో తగ్గిపోయింది..మరి ఈయన హయాంలోనే కదా ఇప్పుడు అరకు ఎమ్మెల్యేని చంపింది.

ఈ మాట అటుంచితే..బురద జల్లడం ప్రతిపక్షనేతకి అలవాటని చెప్తున్న చంద్రబాబు తానే స్వయంగా ఓటుకు నోటు కేసులో ముద్దాయి ( జనం దృష్టిలో) కాదా..కేవలం రేవంత్ రెడ్డి దొరికిపోతే సరిపోతుందా..నిజంగా గుండెలమీద చేయేసి ఆ యవ్వారంతో నాకు సంబంధం లేదు అని చెప్పమనండి. .చట్టం శిక్షించనీయండి లేకపోతే లేదు..నిజం ఏమిటో తెలీదా..పైగా  ఇప్పుడు కేంద్రం దొంగలను పట్టుకోకుండా ఇలా దాడులు చేస్తుందని ఆక్షేపించడం ఏంటి
తమిళనాడులో కనిమెళి, రాజా, జార్ఘండ్ లో మధు కోడా, బళ్లార ిబ్రదర్స్, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వీళ్లందరిపై కూడా ఇలా ఆరోపణలు రాలేదా..వాళ్లంతా అవినీతిపరులు..మనం మాత్రం నిజాయితీ ముత్యాలు అంటే ఎలా కుదురుద్ది. మరి ఇప్పుడు బురదలో ఉండి ఎవరు ఎవరికి అంటించారో తెలీదా..పైనుంచి కిందదాకా ప్రతి ఒక్కల్లూ జగన్ పై కేసులు పెట్టడానికి కారణాలు ఇప్పటికి కనీసం వెయ్యిసార్లు చెప్పి ఉంటారు. ఇంత తెలిసి కూడా ఇంకా వాదించడం ఎందుకు ?

Comments