నన్ను గోకబోయాడు అని తనుశ్రీ అంటుంటే..అసలోడి కంటే ఈయన బాధ ఏంటంట


ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడో మాట్లాడిన తారలు ఇప్పుడు మళ్లీ గొంతు విప్పుతున్నారు. ఈసారి కొత్త కొత్త మనుషులు , సొసైటీలో చాలా నిజాయితీ ఉన్నోల్లలా కన్పించేవాళ్లని కూడా ఇందులో లాగుతుండటంతో గందరగోళం ఉంది. ఐతే బాధితులు మాకు ఇలా జరిగిందీ అని చెప్తుంటే..కాదు అలా కాదు అని కొట్టి పారేసేవాళ్లూ తక్కువ లేరు.
వారిలో తనుశ్రీదత్తా అనే అమ్మడు కూడా ఉంది. ఈమె మన తెలుగు సినిమాలో కూడా మెరిసింది. బాలకృష్ణ వీరభద్ర అనే ఫ్లాప్ మూవీలో ఈమె కూడా ఓ హీరోయిన్. హార్న్ ఓకే ప్లీజ్ అనే హిందీ సినిమా షూటింగ్ లో తనని ఓ నటుడు లైంగికంగా వేధించాడని..చెప్పుకొచ్చింది. ఎవరనేది కొన్ని చోట్ల చెప్పకపోయినా..కొన్ని చోట్ల మాత్రం ఓపెన్ గా నానాపటేకర్ పేరే చెప్తున్నారు. పడకకి ఒప్పుకోనందునే ఆ పాటలో రాఖీసావంత్ ని తీసుకున్నారట

ఐతే నానాపటేకర్ పెద్ద దేశభక్తుడిలా పోజులు కొట్టడం చూసినవాళ్లున్నారు. డిమానిటైజేషన్ టైమ్ లో మోడీని తెగ మోసిన హీరోల్లో ఈయనా ఒకరు..కడక్ చాయ్ తాగినట్లుందంటూ మురిసిపోయాడు. సీన్ రివర్సైన తర్వాత ఆయన బాపు మోడీతో సహా ఎవడూ నోరెత్తడం లేదనుకోండి..ఇతగాడు తనుశ్రీదత్తా కామెంట్లపై ఏం మాట్లాడలేదు కానీ గణేష్ ఆచార్య అని (మన తెలుగోడే0 ) హిందీ డ్యాన్స్ డైరక్టర్ తెగ బాధపడిపోయాడు..నానాగారు చాలా మంచోళ్లు  ఇండస్ట్రీలో చాలామందిని ఆదుకున్నారు..అసలా రోజు జరిగింది వేరు..నాకు గుర్తు లేదు అంటూ నానాపటేకర్ ని కాపాడేందుకు నానాతిప్పలూ పడుతున్నాడు. తనుశ్రీదత్తా సినిమాలు మానేసి అమెరికా చెక్కేసింది. ఆమెకి జార్ఘండ్ ప్రభుత్వం జార్ఘండ్ రత్న అని బిరుదు కూడా ఇచ్చిందప్పట్లో. ఆమెకి ఇప్పుడు  తాజాగా నానాపటేకర్ పై ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటో కూడా గణేష్ ఆచార్య చెప్తే బావుండు. అన్నట్లు ఇప్పుడు తనుశ్రీ దత్తా కింద ఫోటోలా లేదు..బాగా షేపౌట్ అయి గుర్తు పట్టకుండా ఉంది

Comments