సెక్స్ తెలిసిన మగాడు కావాలట ఈ హీరోయిన్‌కి


రోజులు మారేకొద్దీ..ఇవాళ బూతు అన్నది రేపటికి మామూలు అవుతుంటుంది. అందరూ కాకపోయినా కొంతమందైనా అలాంటి ధోరణిని నిరసిస్తారు, కానీ కమర్షియల్ సిినిమా కోణంలో మాత్రం అలా నెగటివ్ ట్రెండ్ని పట్టుకుని సక్సెస్ కొట్టగలిగిన వాళ్లకి తాత్కాలికంగా జేజేలు చప్పట్లు విన్పిస్తుంటాయ్. విషయానికి వస్తే పూజా హెగ్డే అనే కన్నడ భామ తెలుగులో బాగానే గుర్తింపు తెచ్చుకుంది


దువ్వాడ  జగన్నాధమ్ అనబడు సినిమాలో రెచ్చిపోయి అందాల ఆరబోత వేసిన ఈ  అమ్మడికి ఆఫర్లు కుప్పలు తెప్పలుగా రాకపోయినా, మంచి వేషాలే సంపాదిస్తోేంది. చక్కని శరీర సౌష్టవంతో నేటి అమ్మాయికి నిదర్శనంగా
కన్పించే పూజాహెగ్డే టాప్ హీరోల సరసన నటిస్తోంది. తనకి ఎలాంటి హజ్బెండ్ కావాలి అనే ప్రశ్నకి సమాధానంగా
తెలివైనవాడు, సున్నిత మనస్కుడు కావాలని చెప్పుకుంది. ఎవరైనా తెలివైన వాడు కాక..దద్దమ్మ కావాలని కోరుకోరు కదా..ఐతే మంచి హాస్యచతురత కలిగి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉండే లక్షణం కూడా
ఉండాలని చెప్పిందీ భామ.
ఇంతవరకూ ఓకే , కానీ  ఆ తర్వాత సెక్స్ కూడ తెలిసి ఉఁడాలి అని చెప్పడమే విచిత్రం. ఎందుకంటే, సెక్స్ తెలిసి ఉండటం అనేది ఏ కొందరికో మాత్రమే సాధ్యపడే విద్య కాదు. ప్రకృతి సహజంగానే ఆ సమయం వచ్చినప్పుడు
శృంగారంలో మెళకువలు వంటబడతాయి. ఆ మాత్రం దానికి సెక్స్ కూడా తెలిసి ఉండాలని చెప్పడం  ఆమె తెంపరితనానికి నిదర్శనం. ఎందుకంటే రేపు ఎవరినైనా కట్టుకునే ముందు విలేకర్లు ఇదే ప్రశ్న గుర్తుకుపెట్టుకుని మరీ..ఆట పట్టించవచ్చు కూడా..మీ ఆయనకి మరి మీరు ఆశించినట్లు సెక్స్ వచ్చా అని!

Comments