రాజన్న రోజులే వేరు..కన్నీటితో వైఎస్సార్, కేసీఆర్ మధ్య తేడాని గుర్తు చేసుకుంటోన్న సురేఖ


ఒక గొప్ప లీడర్ చనిపోయినా, ఎన్నేళ్లైనా గుర్తుంటారు అనడానికి మరో నిదర్శనం కొండా సురేఖ ఉదంతం. పార్టీలో టిక్కెట్ ఇవ్వకుండా ఆత్మగౌరవం దెబ్బతీశారని వాపోతోన్న కొండాసురేఖ  గతాన్ని తలచుకుంటోంది. టిఆర్ఎస్‌, ప్రభుత్వం రెండింటిలోనూ ప్రజాస్వామ్యం లేదని చెప్తోన్న సురేఖ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోజులు ఎలా ఉఁడేవో ఓ ఛానల్లో  కంటనీరు పెట్టుకుంటూ గుర్తు చేసుకుంది.

 ఇది మామూలు జనానికి పెద్దగా తెలీని విషయాలు కావడంతో ఆసక్తి కలిగించడం సహజం. అప్పట్లో ప్రతి రోజూ సిఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కనీసం 2వేలమంది ప్రజలను రాజశేఖర్ రెడ్డి కలిసేవారట. ఆ తర్వాతే డెలిగేట్స్‌తో చర్చలు ఉండేవట. అక్కడ క్యాంప్ ఆఫీస్‌లోనూ వరసగా ఉన్న గదుల్లో అందరినీ కలిసిన తర్వాతే సెక్రటరియేట్‌కి బయలు దేరేవారట. ఇది నిత్యకృత్యం కాగా, సెక్రటరియేట్ కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ లానే భావిస్తూ టైమ్ మెయిన్ టైన్ చేశేవారని చెప్తున్నారు కొండా సురేఖ. ప్రతి రోజూ పది గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ సచివాలయంలో ఉండేవారట వైఎస్. లంచ్ టైమ్‌లో మాత్రం పదినిమిషాలు విశ్రాంతి తీసుకుని  మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తే అంతమందినీ కలిసేవారట. వారి దగ్గర్నుంచి పిటీషన్స్ తీసుకుని అక్కడిక్కడే అండార్స్ మెంట్స్ చేసేవారట. వీలైతే అక్కడిక్కడే జీవోలు ఇవ్వడం లేదంటే సర్కులేషన్స్‌కి పంపేవారట. వచ్చిన ప్రతి పిటీషన్‌ని తీసుకుని కానీ పంపించేవారు కాదట వైఎస్. వాళ్లందరినీ కలిసిన తర్వాతే క్యాంప్ ఆఫీస్ కి బైల్దేవారట.



వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పట్టించుకోకుండా పిటీషన్‌లోని విషయాలను వీలైనంత త్వరగా పరశీలించి నిర్ణయాలు తీసుకుంటారట వైఎస్. అలానే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన ఛాంబర్‌లో ఎమ్మెల్యేల నుంచి పిటీషన్స్..ఇతర పనులు తప్పకుండా స్వీకరించేవారని..గౌరవంగా చూసేవారని గుర్తు చేసుకున్నారు కొండా సురేఖ..పని అయినా అవకపోయినా ఆ మాత్రమైనా ఎమ్మెల్యేలను బాబు పట్టించుకునేవారని..కానీ కేసీఆర్ మాత్రం ఆ పద్దతి ఫాలో అవలేదని వాపోయింది. కేసీఆర్ కీ ఆ అలవాటు లేదు..ఆయన కొడుకు కేటీఆర్‌కీ ఆ అలవాటు లేదని..కానీ లంచ్ టైమ్ కి వెళ్లినవారితో మాత్రం కలిసి భోంచేస్తారని చెప్పారామె. ఎంతమంది వస్తే అంతమందితో భోజనం చేస్తే ప్రయోజనం ఏంటని..ఎమ్మెల్యేలను కలిసి వారి చెప్తున్న విషయాలను పట్టించుకోవాలని సూచించింది ఆ ఇఁటర్వ్యూలో. ఇలా తానొక్కదానినే కాదని..టిఆర్ఎస్‌లో 2001 నుంచి ఉన్న చాలామంది ఫీలింగ్ కూడా అని సురేఖ చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులను చూసిన తర్వాత ఖచ్చితంగా కంపేరిజన్ వస్తుందని..అందుకే తానిప్పటికీ వైఎస్ ని తలుచుకుంటానని కన్నీటి పర్యంతమవుతూ కొండా సురేఖ సదరు ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది


Comments