ఈ ఫేమస్ సినిమా,టివి నటుడు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌ కూడా అంటే నమ్ముతారా


చిన్నతెరపై ఎన్నో సీరియల్స్‌లో మెప్పించి..సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న వ్యక్తి సమీర్. మరీ బరువైన క్యారెక్టర్లు కాదు కానీ..తెలుగుతెరపై గుర్తుపట్టే పాత్రలే చేశాడు. ముఖ్యంగా రాజమౌళి సినిమాల్లో సమీర్ గుర్తుండిపోయే పాత్రలే చేశాడు. ఋతురాగాలు, ముగ్ధ, కస్తూరి, శాంతినివాసం వంటి సీరియల్స్‌లో నటించిన సమీర్ ఇప్పటిదాకా తెలుగులో దాదాపు 80 సినిమాల్లో చేశాడు. మొదటి సినిమా శుభసంకల్పంగా వికీ పీడియా చెప్తుంది కానీ..అసలు విషయం ఏమిటంటే బాలనటుడిగా కూడా సమీర్ ప్రేక్షకులను మెప్పించాడు.



 ముఖ్యంగా రేపటిపౌరులు సినిమాలో కోట శ్రీనివాసరావు కొడుకుగా క్లైమాక్స్‌లో మంచి నటన ప్రదర్శించడంతో ఈ చిచ్చరపిడుగు ఎవరో మంచి నటుడు అవుతాడు భవిష్యత్తులో అనుకున్నారు. లంచాలకు అలవాటు పడిన ఎస్ ఐ క్యారెక్టర్లో కోట నటించగా..అతని చేష్టలను అసహ్యించుకునే కొడుకుగా సమీర్ నటించాడు రేపటి పౌరులులో. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించిన సమీర్ వయసు పెరిగిన తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కన్పించాడు..అవి ఒకటి సూపర్ స్టార్ కృష్ణ నటించిన రౌడీ అన్నయ్య..రెండోది వెంకటేష్ హీరోగా నటించిన చంటిలో చిన్నప్పటి నాజర్‌గా..








ఆ తర్వాత టీనేజ్ రావడంతో తెరకి దూరమైన సమీర్ ..పెద్దైన తర్వాత టివి సీరియల్స్‌ చేయడం ప్రారంభించాడు. అలానే తిరిగి వెండితెరపైకి శుభసంకల్పంతో రీ ఎంట్రీ ఇచ్చాడంటారు. ఇప్పటికీ టివి సీరియల్స్‌ చేసే సమీర్..తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ అతని పర్సనాలిటీ టివీ హీరోలకి ఎక్కువ..సినిమా హీరోకి తక్కువ కావడంతో  మధ్యస్థమైన క్యారెక్టర్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఏ హీరో ఫ్రెండ్ గానో, బావగానో, డాక్టర్ గానో, అన్నదమ్ముల పాత్రలలోనో తప్ప కథకి కీలకమైన పాత్రలు మాత్రం సమీర్ కి దూరం అలా మంచి టాలెంట్ ఉన్నా కూడా చివరికి సైడ్ క్యారెక్టర్స్‌కి మాత్రమే పరిమితం అయిపోయాడు.

Comments