ఆకాష్ గుర్తున్నాడా...


మంచి ఒడ్డూ పొడుగూ ఉండి స్టార్ హీరో అవ్వాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా..కెరీర్‌లో వెనకబడిపోవడం ఎలా ఉంటుందో ఆకాష్‌ని గమనిస్తే అర్ధం అవుతుంది. శ్రీలంక తమిళుడైన సతీష్ నాగేశ్వరన్ లండన్‌లో పుట్టి పెరిగాడు. రోజావనం అనే తమిళ సినిమాతో తెరంగ్రేటం చేశాడు ఆకాష్..తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఎంట్రీనే దొరికింది ఆకాష్‌కి. ఏకంగా 18 సిినిమాలు సెట్‌పై  ఉన్న హీరోగా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాడు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండటంతో ఖచ్చితంగా ఓ మంచి భవిష్యత్తు ఉంది ఇతనిక ిఅని అనుకున్నారు. దానికి తోడు ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ కూడా సపోర్ట్ ఉంది..తెలుగులో ఆనందం మంచి బ్రేక్ ఇచ్చింది ఆకాష్‌కి. ఐతే ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్. అసలు తెలుగులో ఇతగాడి మొదటి సినిమా జూన్-జులై..ఇది ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. ఇందులో హీరోయిన్ సదాఫ్..నిర్మాత ఎంకే మావుళ్లయ్య. మంచి పాటలు ఉన్న ఈ సినిమా అలానే మూతపడింది. చాలామంది స్టార్స్ మొదటి సిినిమాలు విడుదల కానట్లే..ఆకాష్ సినిమా కూడా రిలీజ్ కాలేదని సరిపెట్టుకోవాలి. నీతో చెప్పాలని, మనసుతో, తార, పిలిస్తే పలుకుతా, హైటెక్ స్టూడెంట్స్ ఫ్లాప్ కాగా..తిరిగి శ్రీనువైట్ల తీసిన ఆనందమానంద మాయె కాస్త ఆడింది. కానీ తర్వాత హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అందాలరాముడు, నవవసంతం, గోరింటాకు లాంటి సినిమాలలో చిన్న చిన్న కారెక్టర్లు చేయడం చేశాడు. కానీ తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు...ఐనా ఫలితం లేకపోవడంతో తానే హీరోగా సొంతంగా సినిమాలు ప్రారంభించాడు. అలా రామ్ దేవ్, యుగానికి ఒక్క ప్రేమికుడు, జైగురుదేవ్, మిస్టర్ రాజేష్, స్వీట్ హార్ట్ లాంటి సినిమాలు తీశాడు. వీటిలో స్వీట్ హార్ట్ అనే సినిమాకి ఇతగాడే దర్శకుడు..అసలు ఈ  సినిమాలు వచ్చినట్లు కూడా చాలామందికి తెలీదు. అలా క్రమంగా థర్డ్ గ్రేడ్ హీరో స్థాయికి పడిపోయాడు. ఒకప్పుడు యూత్‌లో క్రేజ్ తెచ్చుకుని..వయసు ఉండి, అందం ఉండి కూడా ఫేడౌట్ అయిపోయాడు. పైగా శరీరం విపరీతంగా పెరిగిపోయి..తనకంటే పెద్ద హీరోలకంటే ఎక్కువ వయసు ఉన్నవాడిలా కన్పించేలా మారిపోయాడు. ఆహా ఎంతటి అందం అనే సినిమాని తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు తమిళంలో తానయన్ అనే సినిమా కూడా మూడు భాషల్లో తీసాడు. ఇంకా తనని సక్సెస్ ఫుల్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాడు. మిస్టర్ రాజేష్ లో ఒక్కసారే ఏడు క్యారెక్టర్లు చేశాడు. అలానే ఆమా నేన్ పొరుకిత్తేన్ అనే తమిళ సిినిమాలో 5 క్యారెక్టర్లు చేశాడు..ఈ వేషాలన్నీ కూడా ఓ రకమైన మేనియాలో ఆకాష్ చేస్తున్నాడంటారు. ఒక్కోతరంలో ఒక్కో యంగ్ హీరో ఎమర్జ్ అవుతుంటే..ఆకాష్ మాత్రం అతి తక్కువ వయసులోనే స్టార్ డమ్ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 1999లో ఎంటర్ అయిన ఆకాష్ వయసు 37ఏళ్లేనంటే ఆశ్చర్యపోకతప్పదు. ఎంతో భవిష్యత్తు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆకాష్ ఇలా అయిపోవడానికి లిక్కర్ తీసుకోవడం, డిసిప్లిన్ లోపించడం కారణం అయితే..కెరీర్ ఫ్లాప్ అవడానికి అతి ఉత్సాహంతో పనికిమాలిన సబ్జెక్టులను ఎంచుకోవడం మరో కారణంగా అర్ధం అవుతోంది

Comments