ఈ ముగ్గురూ కలిస్తే..ఫ్యాన్స్ కి పండగేగా


వీళ్లు పొలిటికల్ స్టార్స్...స్టార్ పొలిటీషియన్స్...
నిజానికి ఇప్పుడు చెప్పుకోబోతున్నవాళ్లు ఇప్పటికన్నా..ఓ పది పదిహేనేళ్లక్రితం దేదీప్యమానంగా తెరపై వెలిగిపోయారు.
తెలంగాణ పోల్ సీన్‌లో ఇదో అనూహ్యమైన పరిణామం..పొడిచిన కొత్త పొద్దుతో ఇప్పటిదాకా కలవని ఈ స్టార్స్ కలవబోతున్నారు...ఆన్ స్క్రీన్ పై కలిసి దుమ్ము దులిపారు..కలెక్షన్ల ప్రభంజనమే సృష్టించారు..మరిప్పుడు ఈ ఇద్దరూ కలిస్తే...ఇద్దరే కాదు..వారికి హీరోయిన్ కూడా  జత కలిస్తే పొలిటికల్ ఎరీనాలో ఈక్వేషన్స్ మారిపోతాయా...

తెలుగు తెరపై సూపర్ హిట్ కాంబినేషన్ అని కొంతమందిని పిలుస్తుంటారు వారిలో బాలకృష్ణ విజయశాంతిలది ఓ జంట..వీరిద్దరూ తెరపై కలసి 18 సినిమాల్లో నటించారు. నాలుగైదు తప్పించి అన్నీ సూపర్ హిట్లే..ఐతే చివరిగా వీళ్లు  కలసి నటించింది మాత్రం 1993లో వచ్చిన నిప్పురవ్వలో...
()
వాయిస్() తెలుగు తెరపై సూపర్ జోడీ అన్పించిన వీళ్లిద్దరూ తెరపై కన్పించారంటే..మాస్ ఆడియెన్స్ హుషారెత్తిపోతారు. పామరజనానికి ఊపు తెచ్చే స్టెప్పులు..డైలాగులు చెప్తుంటే బాక్సాఫీస్ షేకైపోయేది..అలా ముద్దుల మావయ్య, మువ్వగోపాలుడు ముద్దులకృష్ణయ్య, భలే  దొంగ..లారీ డ్రైవర్ రౌడీ ఇన్సెపెక్టర్..తల్లిదండ్రులు సినిమాలతో కనక వర్షం కురిపించారు
() ఓ వైపు విజయశాంతి సోలోగా నడిపించిన సినిమాలు ఆమె ఇమేజ్ ని ఆకాశానికి చేర్చాయి. కర్తవ్యం, ఆశయం పోలీస్ లాకప్.తో లేడీ అమితాబ్ అయిన విజయశాంతి..ఒసేయ్ రాములమ్మతో లేడీ సూపర్ స్టార్ అయ్యారు. దాంతోనే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఐతే ఎమ్మెల్యేగా కాకుండా..ఎఁపిగానే గెలిచారు. అప్పటికి బాలయ్యబాబు రాజకీయాల్లోకి రాలేదు..ఆ తర్వాత వీరి దారులు వేరవడంతో కలిసే అవకాశమే లేకుండా పోయింది..
ఇప్పుడు కాంగ్రెస్, టిడిపి పొత్తు ఖరారు కావడంతో ఈ ఇద్దరు కలిసే అవకాశం కన్పిస్తోంది..ఇప్పటికే కాంగ్రెస్ కి స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి రంగంలోకి దిగబోతున్నారు..మరోవైపు బాలయ్య ఆల్రెడీ ఖమ్మంలో దుుమ్ము దులపడం ప్రారంభించారు..అది కూడా చొక్కా విప్పి మరీ...స్పాట్
() అటు టిడిపి, ఇటు కాంగ్రెస్ రెండూ ప్రచారంలో దూసుకుపోవాలంటే ఈ ఇద్దరూ అవసరమే..అందుకే ఇప్పటిదాకా పొలిటికల్ వేదికను పంచుకోని ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ఒక్క సారైనా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

***** ఈ ఇద్దరి కాంబినేషన్ తోనే తెలంగాణ ఎన్నికల సీన్ అయిపోతుందనుకుంటే పోరబాటు..మరో సూపర్ హిట్ కాంబినేషన్ కూడా అవకాశం ఉంది..అదే మెగాస్టార్ చిరంజీవి..ఈయనతో కూడా విజయశాంతి కలిసి అనేక సినిమాలు చేసింది..ఇప్పటికిప్పుడు చిరంజీవి తేల్చడం లేదు కానీ..ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నట్లు అనుకోవాలి. మరి ఈ ఇద్దరూ కలిస్తే
---
తెలుగు తెరకు స్టెప్పులు..ఫైట్లు..కొత్త పుంతలు తొక్కించింది మెగాస్టార్..అలాంటి మెగాస్టార్ తో ఢీ అంటే ఢీ అన్నంత స్థాయిలో నృత్యాలు చేసిన కొంతమందిలో విజయశాంతి కూడా ఒకరు..

() ముందే చెప్పుకున్నట్లు విజయశాంతే మెగాస్టార్ కంటే ముందుగా పొలిటికల్ ఆరంగ్రేటం చేశారు. సినిమాపై హుషారుగా షికార్లు చేసిన ఈ జంట రాజకీయాల్లో మాత్రం అస్సలు కలబడలేదు..కలిసింది లేదు
తెరమీద అంత జోరుగా ఇరగదీసిన ఈ సూపర్ హిట్ పెయిర్..పాలిటిక్స్ లో  ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరించారు

() విజయశాంతి టిఆర్ఎస్, తల్లితెలంగాణలో యాక్టివ్ గా ఉన్నప్పుడు కానీ..చిరంజీవి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా తారసపడన దాఖలాలు లేవు..అంతెందుకు తెలుగు సినిమా వజ్రోత్సవంలోనూ విజయశాంతి జాడే లేదు..దీనికి మెగాస్టార్ తో గ్యాంగ్ లీడర్ సమయంలో వచ్చిన విబేధాలే కారణమంటారు..ఆ తర్వా త మెకానిక్ అల్లుడులో వీరిద్దరూ నటించిారు..అదే వీరి కాంబినేషన్లో లాస్ట్ సినిమా

() ఐతే ఇప్పుడు ఈ ఇద్దరూ కాంగ్రెస్  పార్టీలోనే ఉన్నారు..ప్రస్తుతానికి జనసేనవైపు అన్నయ్య అడుగులు వేస్తారని  అనుకుంటున్నా..ఎక్కడా ప్రకటించింది లేదు..అటు టిడిపితో పొత్తుతో బాలయ్యతో..ఇటు సొంత పార్టీలో చిరుతో విజయశాంతి కలిస్తే...గెలుపోటములు సంగతి పక్కనబెడితే..అదో కలలాంటి వాస్తవం సాకారమైనట్లే..ఎందుకంటే   ఈ రెండు కాంబినేషన్లు..అప్పట్లో యూత్ ని ఉర్రూతలూగించాయి..ముగ్గురికీ ముగ్గురూ పిచ్చ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు..ఇప్పుడు పొత్తుల రూపంలో మరోసారి ఫ్యాన్స్ ని అలరించే అవకాశం కన్పిస్తుంది..మరి ఈ ముగ్గురూ ఏం చేస్తారో చూడాల్సిందే

Comments