ఉత్తమ్ ఇది మర్చిపోతే ఎలా


కూటమి కట్టడం వరకూ బాగానే ఉంది కానీ..కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కోవడంలో మాత్రం కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విఫలం అవుతున్నారు. అసలు కేసీఆర్ దంచుడు బిగిన్ అయితే..బండబూతులొక్కటే తక్కువ..మరి వీళ్లో అంతా చప్పగా ప్రచారం చేస్తూ తిరుగుతారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు మోడీతో  జట్టు కడతారు చూడండి ప్రజలారా..అంటూ విమర్శించడం రైటేనా...
ఎందుకంటే తెలంగాణ  ప్రజలకు ఏం కావాలో అది చెప్పాలి..ఏం చేస్తారో అది చెప్పాలి  అంతేకానీ..పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ఎవరితో జట్టు కడితే లోకల్ పీపుల్ కి ఎందుకు.. ? ఈ ఒక్క అనలైజేషన్ చాలు కదా..ఎవరి ప్రణాళికలు ఎలా ఉన్నాయో అర్దం అవడానికి..ఇంత నాసిరకపు ప్రచారంతో ఎందుకు రంగంలో దిగుతారు..దిగి గెలుస్తారని ఎందుకు అనుకుంటారు..పైగా ఉద్యమంలో చేరని వారిని మంత్రులు చేసుకున్నారని ప్రత్యేకంగా
విమర్శించడం మరో తప్పు..ఎందుకంటే..ఆ విషయాలన్నీ ఎన్నికల సంగతులు కాదు..

కేసీఆర్ ఏం చేశానని..వచ్చాడు..ఏం చేస్తానని చెప్పాడు..ఏం చేయలేకపోయాడు..ఇవి వివరించాలి..ఎక్కడిక్కడ సెంటిమెంట్ రె్చ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టే దొంగల్లాగా మారితేనే కాంగ్రెస్ కి సీట్లు దక్కేది..పైగా కేసీఆర్ వాడిన పదజాలం చూస్తే..ఆయనకు ఎంత నిర్లక్ష్యం ఏర్పడిందో అర్ధం అవుతుంది..అడుక్కుంటే పది సీట్లు పడేసేవాడిని అన్న నాయకుడిని ఎలా విమర్శించాలో..ఎలా అటాక్ చేయాలో కూడా తెలీని నేతలు కాంగ్రెస్ లో ఉండటం ఆ పార్టీ క్యాడర్ కే చికాకు తెప్పించకమానదు.

Comments