బాబుకి చట్టమంటే భయమా..గౌరవమా


చంద్రబాబునాయుడు గారు ఎప్పడూ ఒక మాట చెప్తుంటారు  తప్పు చేయనప్పుడు ఎవ్వరికీ భయపడక్కర్లేదని..
 గత ఎన్నికల తర్వాత తన మాటతీరులో కూడా స్పీడ్ పెరిగింది. .బుల్లెట్ లా దూసుకుపోతా..ఎవరికీ భయపడను..నేను నిప్పు...ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..లెక్కపెట్టేది లేదు లాంటి రొటీన్ డైలాగ్స్ వేస్తూనే ఉంటారు.
ఐతే ఇప్పుడు ధర్మాబాద్ కోర్టు రెండు డజన్లసారు నోటీసులు ఇచ్చినా వాటికి సమాధానం ఇవ్వాలని ఎందుకు అన్పించలేదో...బహుశా మోడీ తో మిత్రుడిగా ఉన్నాం కాబట్టి పట్టించుకోలేదనుకోవాలి
కానీ ఇప్పుడు మాత్రం కోర్టుకి వెళ్తా ...అన్నారు తర్వాత ఆయన పుత్రుడు లోకేష్ కూడా బాబుగారు బెయిల్ కూడా తీసుకోరంటూ ప్రగల్బాలు పలికారు.
తీరా ఏమైంది..ఆయన వెళ్లలేదు..పైగా రీకాల్ పిటీషన్ రద్దు చేయమన్నారు కానీ కోర్టు వినలేదు..ముందు ఒక్కసారైనా తమ ముందుకు వచ్చి మొహం చూపించి వెల్లమంది..ఆ డేటూ దగ్గర పడింది. ఇప్పుడు మొదలైంది అసలు డ్రామా...ఒక మంత్రేమో సార్ మీరు సిఎం మీరు కోర్టుకెళ్లడమేంటి అంటారుట..లీకులు అలా ఉన్నాయ్ మరి
మరో మంత్రేమో హే...మనం వెళ్లాల్సిందే వెళ్తేనే కూటమి అభ్యర్ధులకు ఓట్లు పెరుగుతాయంటాడ(ట). ఇంకో మంత్రేమో
సార్సార్ నా దగ్గరో మంచి ఐడియా ఉంది..భారీగా ర్యాలీ పెట్టుకుని వెళ్తాం అంచాడట
ఇంతకీ చంద్రబాబుకి నోటీసులు వస్తే, అది దేశం సమస్యనా..ఓ వేళ అనుకుందాం..అంత నిప్పైతే..ఎఁదుకు భయపడటం కోర్టుకి వెళ్లి మొహం చూపించిరావడానికి..ఓ వేళ భయం కాదు అనుకుందాం..మరి గౌరవం కూడా లేదా..అదే ఉంటే కోర్టు నోటీసు రాగాేనే వెళ్లాలి కదా..ఎందుకు వెళ్లడం లేదు మరి..వెళ్తే చాలు అరెస్ట్ చేయమంటుందేమో అన్న ఆలోచనే కదా..ఇప్పుడు చెప్పండి సర్..ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడనే ఎటకారం చేసే ముందు మీ గురించి ఓసారి ఆలోచన చేయండి..నోనో...నో..వాటాయామ్ సేయింగ్ ఈజ్...!

Comments