కృష్ణ సృష్టించిన ఈ రికార్డు బద్దలు కొట్టడం చిరు,పవన్,మహేష్, జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా ఎందుకు సాధ్యపడటం లేదో తెలుసా




సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన ఈ రికార్డ్‌ని బద్దలు కొట్టడం ఏ హీరోకి సాధ్యపడలేదు ఇక ముందు పడదు కూడా
సూపర్ స్టార్ కృష్ణ..ఇప్పటి యూత్‌లో కొద్దిమందికి తప్ప అందరికీ ఆయన గురించి తెలుసు. తెలుగు సినిమా
ఇండస్ట్రీలో అటు టెక్నికల్‌గా..ఇటూ మూవీస్ మేకింగ్ పరంగా రివల్యూషన్ తీసుకొచ్చిన ఘనుడాయన.
దాదాపు 350 సినిమాల్లో పాత్రలు పోషించిన క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ పేరుతో ఎన్నో రికార్డులు 
ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ పదిలంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు రికార్టులు ఉన్నవి
బద్దలు అయ్యేందుకే అని అంటున్న నేటికాలంలో కృష్ణ రికార్డ్స్ కొన్నైతే అసలు శాశ్వతంగా ఉండిపోతాయేమో
అన్పించకమానదు. ఉదాహరణకు త్రిబుల్ రోల్స్, డ్యూయల్ రోల్స్ కృష్ణ చేసినన్ని ఆయన సమకాలీకుల్లో ఎవరూ చేసి ఉండరు. 
అంతకు ముందు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా చేసి ఉండొచ్చు కానీ కృష్ణ ఎంట్రీ ఇచ్చిన తర్వాత
ట్రెండ్ మారిపోయింది. డ్యూయల్ రోల్స్ విషయంలో సూపర్ స్టార్‌కి ఓ రికార్డు ఉంది. ఒకే సంవత్సరం అంటే క్యాలండర్ ఇయర్‌లో మూడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు కృష్ణ. అవి అగ్నిపర్వతం, అందరికంటే మొనగాడు, మహామనిషి..వీటిలో అగ్నిపర్వతం 1985 జనవరి 11న విడుదల అయింది. ఏప్రిల్ 25న అందరికంటే మొనగాడు రిలీజ్ అవగా..మూడో సినిమా మహామనిషి 1985 నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1985 నుంచి ఇప్పటిదాకా ఏ హీరోకి ఇలాంటి  రికార్డు లేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్..పవన్ కల్యాణ్ ఎంతమంది హీరోలు వచ్చినా ఇది పదిలం.
అసలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడమే గగనం అయిన తరుణంలో ఇక డ్యూయల్ రోల్ చేయడమనేది సాధ్యపడదేమో..ఇక్కడే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి చెప్పుకోవాలి..ఆయనకీ ఇలాంటి రికార్డు లేదా..అంటే ఉంది కానీ అది డ్యూయల్ రోల్‌గా చెప్పలేం. పైన చెప్పిన సూపర్ స్టార్ సినిమాల్లో రెండు పాత్రలూ ఒకే ఫ్రేమ్‌లో కన్పిస్తాయి. ఎన్టీఆర్ ఒకే ఏడాదిలో అంటే 1981లో ఇలానే ద్విపాత్రాభినయం చేసిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అవి గజదొంగ, కొండవీటి సింహం..విశ్వరూపం..ఐతే వీటిలో విశ్వరూపంలో
లెక్చరర్ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత రెండో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది..అలా ఒక ఫ్రేమ్‌లో రెండు పాత్రలు కన్పించవు కాబట్టి..డ్యూయల్ రోల్‌లా చెప్పలేం. దీంతో సూపర్ స్టార్ పేరిట రికార్డు అలా చరిత్రలో నిలిచిపోయింది. 

Comments