ఎన్టీఆర్ ట్రైలర్‌లో ఈ 7 విషయాలు గమనించారా



తండ్రి పాత్రలో కొడుకు నటించడమనేది ఇంతవరకూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే జరగలేదు. ఆ మాటకి వస్తే..ఏ
సినిమా చరిత్రలోనూ జరిగి ఉండదు..సినిమా ఆడియో తర్వాత విడుదలైన ట్రైలర్ చూస్తే..మనకి ఇంకా కొ్న్ని
విషయాలు తెలుస్తాయి..అందులో ఒకటి ట్రైలర్‌లో మొదట కన్పించే కిరీటం. ఇది తొలిసారిగా ఎన్టీఆర్ మాయాబజార్
సినిమాలో ధరించినది..ఎన్టీఆర్ మ్యూజియంలో ఉంచారు..దీన్నే ఇప్పుడు బాలయ్యబాబు సినిమా కోసం
వాడుకున్నారు..మామూలుగా ఉండే కిరీటం కంటే..ఇది చిన్నది..ఎన్టీఆర్ తలకి తగ్గట్లుగా దాన్ని తర్వాత సైజు తగ్గించి చేశారు..అదే బాలయ్య వాడారు.

 రెండో సీన్ లో చూస్తే..మేకప్ వేసే ఓ వ్యక్తి కన్పిస్తారు..అది పీతాంబరం అని పెద్ద
మేకప్ మేన్ ఈయన తెల్లవారుఝామున లేచి గ్రీన్ రూమ్ లో ఉంటే..ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటివాళ్లంతా
క్యూలో నిలబడి మేకప్ వేయించుకుని వెళ్లేవారు. అంత డిమాండ్ ఆయనకి..ఎవరు ముందు వస్తే వారికి టచప్
చేసేవారట. పైన చెప్పుకున్న ముగ్గురూ అలా పోటీలు పడి నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చా అని
సరదాగా దెబ్బలాడుకునేవారట. ఈయన కొడుకే పి.వాసు తమిళంలో పెద్ద డైరక్టర్..చిన్నతంబి, చిన్న గౌండర్, లాంటి
60 వరకూ సినిమాలు తీశారు..రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖి గుర్తుందిగా..ఆ డైరక్టరే ఈ వాసు..అలానే బాలకృష్ణ సీమసింహంలో విలన్ గా కూడా చేశాడు.

ఇక ట్రైలర్ ప్రకారం మనకి తెలిసే ఇంకో కొత్త విషయం..నందమూరి బసవతారకానికి వయొలిన్  వాయించడం వచ్చనేది..ఆమె  గురించి కావాలని తెలియనివ్వలేదో..అదలా జరిగిపోయిందో కానీ ఇలాంటి ఎన్నో విశేషాలు మనం ఎన్టీఆర్ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. అలానే ఇఁకో ఫోటో చూస్తే తెలిసేది..ఎన్టీఆర్ రిక్షా రాముడిగా జనం నీరాజనం అందుకునే సీన్..అందులో ఆయన ఎక్కిన రిక్షాలు ఇప్పటికీ కొన్ని ఊళ్లలో కన్పిస్తుంటాయి..వీటిని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ జిల్లాలో ఇప్పటికీ ఇలాంటి రిక్షాలు కన్పిస్తుంటాయ్. రిక్షాలకు అటూ ఇటూ ఎన్టీఆర్ ఎఎన్నార్, కృష్ణ రిలీజ్ సినిమాల పేర్లని అమర్చుకుని సంతోషపడేవారు. ఇంకో సీన్ చూస్తే..పాతాళభైరవి కన్పిస్తుంది. ఇక్కడ ఎస్వీఆర్ పాత్రలో ఎవరు  నటించారో పోల్చుకోవడం కష్టమవుతోంది బహుశా మోహన్ బాబు చేశారేమో అనే టాక్ విన్పిస్తోంది.అప్పట్లో ఎన్టీఆర్ సన్నగా ఉండగా..బాలయ్యబాబు ప్రస్తుతం హెవీగా ఉండటంతో..అది పెద్దగా సూటైనట్లు కన్పించడం లేదు.

 ఇక  కాషాయ వస్త్రాలతో ఆవేశంగా నడిచివస్తోన్న సీన్ ఎన్టీఆర్ మహానాయకుడిగా మారిన తర్వాత వచ్చే సీక్వెల్
లోది..అందులో గత 20ఏళ్లుగా కన్పించడం మానేసిన దగ్గుబాటి రాజాని చూడొచ్చు.  ఈ సీన్ ఆయన అమెరికా
వెళ్లిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు సిఎంగా ఎన్నిక అయిన ఎపిసోడ్ లోని ముఖ్యమైన సీన్ ..అసెంబ్లీలో తన వర్గం
ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా..గంభీరంగా నిశ్సబ్దంగా కూర్చున్న సన్నివేశంతో ట్రైలర్ ముగుస్తుంది..స్థూలంగా తిరిగి పదవి స్వీకరించడంతో మహానాయకుడు కూడా ముగుస్తుందని అర్ధమవుతోంది. నందమూరి ఫ్యాన్స్ ఈ రెండు
సినిమాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారనడంతో సందేహమే లేదు

Comments