అది జరిగితే...కేసీఆర్‌కి చుక్కలే..!


ఎన్నికలంటేనే అంకెల లెక్కలు..48శాతం ఓట్లొచ్చినా...3శాతం ఓట్లొచ్చినవాళ్లదే గెలుపు అంటారు..అంటే అలయన్స్‌తో
బరిలో దిగిన పార్టీల విడివిడి ఓట్లశాతం కలిపి..మెజారిటీ ఓట్లొచ్చిన వారికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. 
జరుగుతున్న తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుతానికి పేపర్‌పై అటూ ప్రజాఫ్రంట్ కానీ..టిఆర్ఎస్ కానీ రెండూ బలంగానే కన్పిస్తున్నాయ్. కానీ 
ఓట్లశాతాల లెక్కలకి వచ్చేసరికి మాత్రం ప్రజాఫ్రంట్ చాలా బలంగా ఉన్నట్లు కన్పిస్తుంది. ప్రీ పోల్ సర్వేలు మాత్రం టిఆర్ఎస్ కే లాభం చేకూరుతుందని వస్తున్నాయ్. ఈ నేపధ్యంలో ఓసారి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీల మధ్య నిజంగానే ఓట్లు బదిలీ అయితే సిచ్యుయేషన్ టిఆర్ఎస్‌కి ఎదురుగాలి వీస్తున్నట్లే చెప్పాలి

గత 2014 ఎన్నికలలో టిఆర్ఎస్ కి 33శాతం..బిజెపికి 7శాతం..టిడిపికి14శాతం, కాంగ్రెస్ కి 24శాతం, వైఎస్సార్సీపికి 3శాతం ఓట్లు వచ్చాయి
ఇండిపెండెంట్లకు 11శాతం దక్కడం విశేషం. అందుకే ఈసారి కూడా ఇండిపెండెంట్లదే హవా అని లగడపాటి లాంటి వాళ్లు జోష్యం చెప్తున్నారు.
ఇప్పుడు ఫ్రంట్ గా ఏర్పడిన టిడిపికి 14శాతం..కాంగ్రెస్ 24శాతం ఓట్లు దక్కించుకున్న ప్రకారం అప్పుడు ఓట్లు వేసినవాళ్లంతా తిరిగి కూటమికి వేస్తే...సిచ్యుయేషన్ ఇలా ఉండబోతోంది
24+14=38 శాతం ... ఈ కూటమికి సిపిఐ కూడా కలిస్తే...39శాతం ఖాయం..కానీ గతంలో ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ 500కి తక్కువ
కాకుండా ఓట్లు సాధించుకుంది..అలా 3శాతం ఓట్లు కీలకం...ఈ మూడు శాతం కూటమికి పడితే..(ఇదో అంచనా) అప్పుడు కూటమి బలం 42శాతంగా తేలుతుంది..లేదు ఈ 3శాతం బయట ప్రచారం జరుగుతున్నట్లుగా..టిఆర్ఎస్ కే వేస్తే...టిఆర్ఎస్ ఓట్లశాతం 33 నుంచి 36శాతానికి పెరుగుతుంది
అలా చూసినా...కేసీఆర్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి...మరో రెండుశాతం ఎక్కువ కావాలి..అంటే మైనర్ స్వింగ్ ముఖ్యం..
కానీ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్ కన్పిస్తున్న సమయంలో..ఆంధ్రప్రాంత ఓటర్లను ప్రభావితం చేయడంలో కేసీఆర్ అండ్ బ్యాచ్ ఫెయిలైంది..(ఇది కూడా అంచనానే)  విడిగా  33శాతం ఓట్లతో టిఆర్ఎస్ కి 63 సీట్లు 2014లో వస్తే...25శాతం ఓట్లతో 22 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి దక్కాయి.. 21శాతం ఓట్లతో టిడిపి 20 సీట్లు తెచ్చుకుంది అంటే ఇక్కడ కూడా ఓటింగ్ శాతం కీలకంగానే కన్పిస్తుంది..
సింపుల్‌గా మరో ఈక్వేషన్ ని గజ్వేల్ నియోజకవర్గంలోనే అన్వయించి చూస్తే... 
2014లో కేసీఆర్ కి 86669 ఓట్లు వచ్చాయి.. ఆయన పోలింగ్ పర్సంటేజ్ 44.42శాతం
వంటేరు ప్రతాపరెడ్డికి టిడిపి తరపున 67303ఓట్లు..34.17శాతంతో దక్కించుకున్నాడు
కాంగ్రెస్ నర్సారెడ్డి 34,085 ఓట్లు...17.46శాతంతో సాధించుకున్నాడు..ఇక్కడ పోలింగ్ 85.85శాతం నమోదు అయింది. మరి పైన చెప్పిన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం  ప్రజాఫ్రంట్ గెలుపు సులభంగా జరగాలి..కానీ గ్రౌండ్ రియాల్టీ వేరుగా ఉంటుంది..ప్రభుత్వం నుంచి లాభం పొందినవారు ఏ పార్టీ అయినా సెంటిమెంట్ కి లొంగుతారు..ఖచ్చితంగా టిఆర్ఎస్ కి ఓటేస్తారు.. మరదే సెంటిమెంట్ హార్డ్ కోర్ టిడిపి, కాంగ్రెస్ ఫ్యాన్స్ కూడా ఫాలో అయి ఫ్రంట్ కే ఓట్లేస్తే...ఎదురుగాలి వీచినట్లే..2014లోనే కేసీఆర్ తెలంగాణా సాధించిన నేతగా
తెచ్చుకున్న మెజారిటీ 19391ఓట్లు..మరిప్పుడు సిఎంగా ఎక్కువ తెచ్చుకుంటారా...మెజార్టీ తగ్గుతుందా...లేక టఫ్ ఫైట్ తప్పదా..ఎందుకంటే పోలింగ్ డిసెంబర్ 7..డిసెంబర్ 4 నుంచి 5 వరకూ జరుగుతున్న పరిణామాలు చూస్తే..ఏదో తేడా కొడుతున్నట్లు అన్పిస్తోంది( కేవలం ఇదో విశ్లేషణే..)

Comments