హరీష్ రావ్ క్యాంప్‌లో నిశ్సబ్దం నిజమేనా


తెలంగాణ రాష్ట్రసమితిలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం జరిగిన తర్వాత..హరీష్ రావ్ క్యాంప్(?)లో
సైలెన్స్ నెలకొని ఉందని ప్రచారం జరుగుతోంది. అసలు నిజంగా వీరిద్దరి మధ్యా ఆధిపత్య పోరు సాగుతుందా..అంటే..ఓ  పార్టీలో బలమైన నేతలు ఉన్న చోట తెలియకుండానే ఈ పోరు ఉంటుంది..వారిద్దరి మధ్య పోటీ లేకపోయినా, కొంతమంది గ్రూపుగా ఏర్పడి అలా ఉందని భ్రమింపజేయడం సహజం..
హరీష్ రావ్ వర్గం అని చెప్తున్న చాలామంది కేటీఆర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండపోవడం గమనించి..రగిలిపోతున్నారని టాక్..కానీ కుటుంబపాలన అయిన తర్వాత మేనల్లుడు, కొడుకులో ఎవరివైపు మొగ్గు చూపుతారంటే సంతానాన్ని కాదని ఇతరులకి కట్టబెడతారనుకోవడం భ్రమ..

అదే టిడిపిని చూస్తే....చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. కొడుకులకు దక్కుతుందనే అంచనాలు లేకపోయినా..ముందుగా ఓ అడుగు వేసి  అధికారాన్ని చేజిక్కించుకున్నారాయన. చంద్రబాబుకి ఈ విషయం తెలుసు కాబట్టే..అల్లుడు వరసయ్యేవారిని దూరంబెట్టి కొడుకుని మంత్రిని చేశేసారు. ఐతే హరీష్ రావ్, కేటీఆర్ ఇద్దరూ ఇద్దరే ఎవరి సామర్ధ్యాలను తక్కువ చేసి చూడలేరు. అందుకే అసంతృప్తిగా ఉన్నా కొంతమంది నోరు మెదపడంలేదంటారు. పైగా ఎన్నాళ్లున్నా సిఎఁగా కేసీఆరే ఉంటారన్న కేటీఆర్ కామెంట్లు కూడా భవిష్యత్ చిత్రాన్ని చూపిస్తున్నాయ్. ఇంకో పెద్ద షాక్ ఏంటంటే..హరీష్ రావ్ ని ఢిల్లీకి పంపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కుదిరితే మంత్రి పదవి..లేదంటే ఢిల్లీస్థాయి పదవి ఇదే సమీప భవిష్యత్తులో హరీష్‌రావ్‌కి కన్పిస్తున్న దృశ్యాలు.  సిఎం తర్వాత పెద్ద పదవి హోంమంత్రిగా చెప్పాలి..అది కూడా తన ఆంతరంగికుడికే కట్టుబెట్టడం ఇంకో మింగుడపడని అంశం. అందుకే కేటీఆర్ వచ్చి కలిసిన సమయంలో హరీష్ అసంతృప్తి ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. కేటీఆర్ కి పదవి కట్టబెట్టడం నచ్చకపోవడం కాదు కానీ..కనీసం ఓ మాట చెప్పి ఉంటే..అది కూడా తనకి ప్రాముఖ్యత ఇచ్చినట్లు ఫీలయ్యేవారు.  అది జరగలేదు కాబట్టే తన్నీరు హరీష్ రావ్ బ్లాంక్ ఫేస్ కన్పించిందనేవారున్నారు.

Comments