ఆప్ కియాతో బలాత్కార్..హమ్ కియాతో చమత్కార్..ఇలా ఉంది చంద్రబాబు తీరు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు ఎక్కడ ఏ మూల చిన్న సంఘటన జరిగినా..అందులో తన ప్రమేయం..తన వైఖరి తెలపడానికి ఏమాత్రం సందేహించరు అనడానికి ఇవాళ మరో రెండు సందర్భాలు దొరికాయి. ఆ మాటకి వస్తే..ఆయన ఓ అరగంట మాట్లాడితే చాలు..వాటిలో ఇలాంటి ప్రవచనాలు..భిన్నవైఖరులు..పరస్పరధ్వైధీబావనలు  అరడజను కన్పిస్తాయి..వాటిలో ఒకటి ఈవిఎంల వాడకంపై..
ఎన్నికలలో ఈవిఎంల వాడకాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నది తానేనంటూ చెప్పుకొచ్చారు. అసలు ప్రజాస్వామ్యం యంత్రాలపై ఆధారపడి ఉండటమేంటని కొత్త వాదన తెస్తున్నారు..ఇది విన్నవారికి చంద్రబాబు ప్రజ్ఞాపాటవాలపై సందేహం రాకతప్పదు. బ్యాలెట్ పేపర్ అక్రమాలు తట్టుకోలేకనే కదా..ఇలాంటి మెషీన్లను తీసుకువచ్చింది.

ఈవిఎంలపై సందేహాలు  ఉంటే..1999లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిపై అభ్యంతరాలు వెల్లిబుచ్చినప్పుడే ఆపేయాల్సింది..అప్పుడు ఊరుకుని తెలంగాణలో ఓటమికో సాకు వెతుకుతుంటే కాంగ్రెస్ వాదనకి ఈయన కూడా వంత పాడటం ఏంటి..సరే వెంటనే ఊరుకున్నారా లేదు..ప్రజాస్వామ్యం యంత్రాలపై ఏంటి అంట..ఈ కామెంట్ వింటే..ఇదివరకులా గంపగుత్తగా బ్యాలెట్ పేపర్లపై సిరా పోయడం..ఎత్తుకుపోవడం వంటివి డెమోక్రసీకి ఎలా ఊతమిచ్చాయో గుర్తుకురాక తప్పదు.

ఇలానే ఇఁకో వాదన..3 రాష్ట్రాల్లో బిజెపి ఓటమితో దేశవ్యాప్తంగా ఆ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తున్న్టట్లు అర్దమైందంటారు..మరి తెలంగాణలో టిడిపి ఓటమితో తెలుగు రాష్ట్రాల్లో టిడిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ఒప్పుకుంటారా..వేరే వాదనలేం వద్దు..ఈ ఒక్క ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పుకోవాలి..పైగా 3 రాష్ట్రాల్లో బిజెపి ఓటమికి చంద్రబాబు పిలుపే కారణమట..ఏమైనా అర్ధం ఉందా..అసలు ఈ మూడు రాష్ట్రాల ప్రచారంలో ఒక్క సారైనా పాల్గొన్నాడా ఈయన. కనీసం బస్తర్ జిల్లాకైనా వెళ్లాడా లేదు..మరి జనం బాబుగారు ఏం చెప్తే అది నమ్మాలని ఎందుకు అనుకుంటారు..

పైగా కరుణానిధి విగ్రహం ఆవిష్కరణకి వెళ్లినచోటా ఇంతే..మొత్తం 40 ఎంపిసీట్లను గెలిపించాలని కోరతాడు. అంటే  అక్కడ డిఎంకే ఒక్కటే పోటీ చేస్తుందా..సరే చేసింది పొండి..తమిళనాడులో ఉన్నదే 39 లోక్ సభ సీట్లు..ఎలా 40 ఎంపి సీట్లను గెలుచుకుంటుంది..మరి ఇదే తీరులో ఏపీలో కూడా ప్రచారం చేయమనండి..మొత్తం 25సీట్లు గెలుస్తామని..అలా చేయరు..ఎందుకంటే..పొత్తులో భాగంగా కాంగ్రెస్ కి కేటాయించినవి గెలిపించమని చచ్చినా ఆయన అడగడు..గాలికి పోయే పిండి కృష్ణార్పణం అంటే ఇదేనా

Comments