చింతమనేని తిక్క నరసింహుడే తీర్చాడు


ఏది తోస్తే అది చేయడం..ఏది పడితే అది మాట్లాడేయడం అదో పెద్ద వ్యక్తిత్వంగా ప్రచారం చేసుకోవడం రాజకీయాల్లో ఈ మధ్య ఫ్యాషన్ గా మారిపోయింది. కృష్ణా జిల్లాలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన తర్వాత బా...గా...పాపులర్ అయిన ఎమ్మెల్యే చింతమనేని..ఆ తర్వాత బస్ కండక్టర్లు..సొంత పార్టీ నేతలు..ఇతర పార్టీ కార్యకర్తలపై బాగానే నోరూ పారేసుకున్నారు. చివరికి ఈయనగారి వైఖరితో చంద్రబాబుకే తలపోటు ఎక్కువైందనీ అంటారు
ఉంటే ఉండండి..లేకపోతే పార్టీ విడిచిపెట్టి పొండి అని కూడా బాబు అన్నారని అంటారు. ఐనా వైఖరి మార్చుకోకపోతే
ఇక విసుగుపెట్టి వదలిశారంటారు. అలాంటిది ఇవాళ లక్ష్మీనరసింహస్వామి ఆయనకు భలే ఝలక్ ఇచ్చేసారు

చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తమో..లేక పాపభీతితో కూడిన దైవచింతనో కానీ..వైకుంఠ ఏకాదశికి చాలామంది విఐపిలు చాలా గుళ్లకి గోపురాలకు తిరిగేశారు. వాళ్లలో చింతమనేని కూడా ఒకరు. ఐతే మంగళగిరి ఆలయానికి వెళ్లొచ్చిన ఈయనకి అక్కడి టోల్ సిబ్బంది భలే చుక్కలు చూపించారు. నేను ఎమ్మెల్యేనే సావీ...అంటున్నా వినకుండా వెనక్కి పంపేశారు. . ..విఐపి స్టిక్కర్లున్న వాహనాలనే అనుమతిస్తున్న టైమ్ లో చింతమనేని కార్ కి ఎమ్మెల్యే అని స్టిక్కర్ లేదట..దీంతో ఫీజు కట్టకుండా కారు అక్కడే వదిలేసి ఎర్రబస్సెక్కాట్ట

ఐతే స్వయంగా నేనే బాబూ మీ చింతమనేనని ఎమ్మెల్యేని గుర్తు పట్టండ్రా బాబూ అన్నంత రేంజ్ లో చెప్పినా వాళ్లినికపోవడంతో మనోడు పాపం..వాహనం దిగి ఎర్రబస్సెక్కి  పోయాడట..ఎక్కడైనా చెల్లుతాయేమో కానీ మనోళ్ల గొప్పలు దేవుడి ముందు కుదరదు కదా..బస్సైతే ఎక్కాడు కానీ కనీసం అందులో అయినా ఈయనగారిని గుర్తు పట్టారో లేదో మరి 

Comments