నారా వారూ..మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో..ఎవరికీ తెలీదు కదా..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఏదంటే తెలుగు జనం కూడా అదే అనాలంటారు..కానీ జనం మాత్రం ఆయనకి రివర్స్ లో షాక్ ఇవ్వడం తెలంగాణలో మొదలైంది..కానీ కింద పడ్డా తనదే పై చేయి అనేవాళ్లతో ఎవ్వరైనా వాదించగలరా..అక్కడకీ కేటీఆర్ బాబుగారి  అసలు స్వరూపం ఇదీ అంటూ నిజాంపేట ప్రచారసభలోనే బైటపెట్టాడాయె, హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగానే మనం కలిసి పోవాలి , అంటే అది కుదరదు సార్ అని
కేటీఆర్ వివరించిన తీరు అందరినీ కాకపోయినా చాలామందిని ఆకట్టుకుంది. పైగా సుహాసినికి కావాలంటే మంత్రిపదవి కట్టబెట్టొచ్చు కదా అనే మాటకి తిరుగులేదు..

అసలు విషయం తెలుగువారి ప్రయోజనాల కోసం కాదు..తనపై కేసులు మాఫీ కోసమే ఇలా టిఆర్ఎస్ వెంటపడుతున్నాడని కొంతమంది ఈసడించుకున్నారు చంద్రబాబుని..కానీ ఆయన ఇంత నిస్సిగ్గుగా టిఆర్ఎస్ ని ప్లీజ్ మాతో కలిిసి రండని దేబిరించడం ఏపీలో చాలామంది టిడిపినేతలకు కూడా నచ్చడం  లేదు. ఛీ పో అంటున్నట్లు వ్యవహరిస్తున్నా కూడా..ఇఁడియా టుడే కాన్ క్లేవ్ సమిట్ వేదికగా..కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నా...ఇంకా రాహుల్ ని ప్రధానమంత్రిగా ప్రకటించలేదు..ఎన్నికలు అయిన తర్వాతే ప్రకటిస్తాం అంటూ ఆఫర్లివ్వడం ఏంటి..

ఇదే సమయంలో జగన్ కేసీఆర్ తో కలవకూడదు..తాను మాత్రం కేసీఆర్ తో కలవవచ్చు అన్న సంకేతం ఎలాంటి 
పరిణామానికి దారి తీస్తుందో ఏమైనా ఆలోచించారా...ఈ ఆరాటం చూస్తుంటే..చంద్రబాబు లెక్కల్లో ఏమైనా తేడాలు వస్తున్నాయేమో అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది. ఎందుకంటే..కేసీఆర్ అసలు టిడిపి అంటేనే లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నాడు..మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరగడానికి ప్లాన్ వేసుకున్న టైమ్ లో ఇలాంటి ఆహ్వానాలతో 
చంద్రబాబు ఏం బావుకునేటట్లు..ఉన్న పరువు కాస్త ఊడగొట్టుకోవడానికి కాకపోతే..!  ఐనా కాంగ్రెస్ ఉన్న కూటమిలో రాహుల్ గాంధీ కాకపోతే..కేసీఆర్నో..చంద్రబాబునో ప్రధానమంత్రిగా చేస్తారని ఎందుకు అనుకుంటారు..పెతీ చోటా కర్నాటక రిజల్టే వస్తుందని గ్యారంటీ ఏంటి..పైగా కాంగ్రెస్ కూటమితో కలిసి..మళ్లీ లోక్ సభ ఎన్నికలలో 16 ఎంపీసీట్లలో కేసీఆర్ ఎన్ని సీట్లలో పోటీకి దిగాలి..ఎన్ని అప్పనంగా ఓడిపోవాలి..జనం ఎటూ తెలంగాణలో కాంగ్రెస్ టిడిపి అడ్రస్ గల్లంతు చేసినతర్వాత..తిరిగి ఆ కూటమితో పోటీకి ఏ మెడకాయ్ మీద తలకాయ్ ఉన్నోడైనా ఒప్పుకుంటాడా. ఇదే కేసీఆర్ రేపో ఎల్లుండో అంటాడు చూస్తుండండి..!

Comments