మింగలేక మంగళవారం...వృధ్దనారీ పతివ్రత కబుర్లెందుకు సబ్బం


రాజకీయాలంటే మాకిష్టం లేదు, మేం దూరం అంటూ ఓ బ్యాచ్ ఏపీలో తిరుగుతుంటుంది. ఉండవల్లి, సబ్బంహరి, రాజగోపాల్, కిరణ్ కుమార్ రెడ్డి..వీళ్లలో పాపం ఎక్స్ సిఎం కిరణ్ కాంగ్రెస్ లో చేరిపోయారు..అప్పట్లోనే డొక్కా ఈ విషయం ముందే చెప్పేశాడు కూడా..కిరణ్ గారు ఓ పెద్ద పదవితో తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చేస్తారని..అదెటూ జరిగిపోయింది..ఇక మిగిలిన బ్యాచ్ లో ఈ ముగ్గురూ తెగ గుంజాటన పడిపోతున్నారు..ఎవరు ఆహ్వానిస్తే వాళ్ల దగ్గరక ివెళ్లిపోవడం..లెక్చర్లు ఇవ్వడంతో కాలం నెట్టుకొస్తున్నారు

పై ముగ్గురిలో ఒకరు ఉండవల్లి మాత్రం అడపా దడపా తనదైన విశ్లేషణలతో జగన్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..కానీ అది ఓపెన్‌గానే..మిగిలిన లగడపాటి, సబ్బం మాత్రం అటు టిడిపిలోకి వెళ్తామని చెప్పలేక..అలా అని బాబుకి మద్దతుగా మాట్లాడకుండా ఉండలేక నానా గుంజాటన అనుభవిస్తున్నారు.  ఎన్నికలలో చెప్పు గుర్తుతో పోటీకి దిగి రెండు రోజుల ముందు పోటీనుంచి విరమిస్తున్నా అంటూ పారిపోయిన సబ్బం..ఇప్పుడు తనకేదో విశ్వసనీయత ఉన్నట్లు..అది తెలంగాణ ఎన్నికల ఫలితంతో పోయినట్లు ...బైటికి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు

వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తన మద్దతు ఎందుకు చెంద్రబాబుకి ఇచ్చానో( టిడిపి+కాంగ్రెస్ దోస్తీ విషయంలో) చెప్పుకొచ్చాడు. దేశ భవిష్యత్తు కోసమంట..రాష్ట్ర భవిష్యత్తు కోసమంట..ఇప్పుడు కూడా బాబు ఏం చేయాలంటే అంటూ దిశానిర్దేశం చేస్తున్నాడు..అంటే ఎవరికీ సలహా ఇవ్వకుండా బాబుగారు ఇలా చే స్తే బావుంటుంది అంటున్నారంటేనే..ఆయన చూపు ఎటుందో తెలిసిపోతుంది..పైగా జగన్-పవన్ కలిస్తే..బాబుకి కష్టమంట..అక్కడికేదో నిజంగానే కలిసినట్లు.."ఇద్దరు తిట్టుకుంటున్న తీరు చూస్తే కలిసేలా లేరు..హిడెన్ ఎజెండా ఏదైనా ఉందేమో తెలీదు" అంటే  ఈయన చెప్పినట్లే జరగాలన్న మాట..కలిసి పోటీనే చేస్తారు ఇక వేరే మాట లేదనుకోవాలని జనం..ఈయన ప్రెస్ మీట్ చూస్తే..అసలు ఎందుకు పెట్టారో ఏమైనా అర్ధం అయితే ఒట్టు.. ఆయన చెప్పింది తెలంగాణ ఎన్నికలలో జరగలేదు కాబట్టి..ప్రెస్ మీట్ పెట్టి బాధపడాలనుకున్నాట్ట...
దీని ద్వారా ఆయన ఇచ్చే సందేశం ఏమిటంటే...జగన్ ఏపీలో గెలవడు..ఇదే అసలు లైన్..ఎన్ని మీటింగులైనా..ఇఁటర్వ్యూలైనా..ఆయన కాన్సెప్ట్ ఇదే..

Comments