పంచ్ పడింది..ఇమ్రాన్ కి


మైనారిటీల విషయంలో భారత్‌కి ఏదో హితవు పలుకుదామని చూసిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌కి జలక్ పడింది. భారత్ గురించి మాట్లాడేముందు తమ దేశం సంగతి తాము చూసుకుంటే మంచిదంటూ భారత్‌‌లోని వివిధ వర్గాల నేతలనుంచి కౌంటర్లు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ మధ్యనే కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవం విషయంలోనూ ఇమ్రాన్ ఇలానే  రభస చేయిబోయి అభాసు పాలైన సంగతి తెలిసిందే
మైనారిటీలతో ఎలా మెలగాలో ప్రధాని మోడీకి చూపుతామంటూ పాకిస్తాన్ ప్రధాని చేసిన కామెంట్లు రివర్స్ అయ్యాయ్. అనూహ్యంగా ఎన్డీఏకి మద్దతుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన స్వరం విన్పించారు. రాజకీయహక్కుల విషయంలో కానీ మరే విషయంలో కానీ భారత్‌ని చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలని సూచించారు. 
 పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే ఆ దేశానికి ప్రధాని కాగలడని, భారత్‌లో అన్ని వర్గాల ప్రజలకు ఆ అవకాశం ఉంటుందని అసద్‌  గుర్తు చేసారు 



మైనార్టీల పట్ల భారతదేశం వ్యవహిరిస్తున్న తీరును చూసి మీరే నేర్చుకోవాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కి  ఒవైసీ సలహా ఇచ్చారు. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడటం లేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుంది అని ఇటీవల ఇమ్రాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే కర్తార్‌పూర్ కారిడర్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత్‌కి సుద్దులు చెప్పబోయారు. అక్కడికి తామేదో శాంతి చర్చలకు పిలుస్తుంటే భారత్ అడ్డుకుంటున్నట్లు ప్రచారం చేయబోయారు. ఐతే మన విదేశాంగమంత్రి, ఆర్మీ చీఫ్ దాన్ని తిప్పికొట్టారు. దాడులు...చర్చలు రెండూ ఒక ఒరలో ఇమడవంటూ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే

Comments