గుండు కొట్టించుకున్న సిఎం రమేష్..ఇంత ఈజీనా స్టీల్ ప్లాంట్


కడపకి స్టీల్ ప్లాంట్ రావాల్సిందే అని..దానికి కేంద్రం అడ్డుపడుతుందని..టిడిపి వాదించింది..
కానీ అసలు మార్గం తన దగ్గరే ఉఁడగా...దానికి రాజ్యసభ మెంబర్ సిఎం రమేష్ ఆమరణదీక్ష కూడా 11 రోజులపాటు చేశాడు చివరికి అసలు కిటుకు తెలిసిపోవడంతో...ఎకాఎకిన ఓ స్టీల్ ప్లాంట్ కడపకి వచ్చేసింది..

అదేంటీ..అక్కడ పడింది పునాది రాయే కదా..ఇలాంటి పునాది రాయే కదా అమరావతి అనే రాజధానికి కూడా పడింది అని అడగవద్దు ఎందుకంటే..ముందు శంకుస్థాపన జరిగితేనే కదా..తర్వాత అన్ని పనులూ జరిగేది..అందుకే ఆ పని ఎటూ పూర్తవుతుందనే సిఎం రమేష్ తన గడ్డం జుట్టు తిరుపతిలో ఇచ్చేశాడు..ఇక్కడ మనోళ్లేమో ఆయన ఇంక పెంచడం నా వల్ల కాదు బాబో..అంటున్నందునే పునాదిరాయైనా వేస్తే..హ్యాపీగా క్లీన్ షేవ్ చేయించుకోవచ్చని రమేష్ ప్లానేసాడని అంటున్నారు..ఇంకొంతమందేమో..అలాంటిదేం లేదు ఖచ్చితంగా
కడపకి స్టీల్ ప్లాంట్ వచ్చేసింది కాబట్టి..ఇక అక్కడున్ను పునాదిరాయి చూస్తూ హ్యాపీగా స్టీల్ అక్కడే కొనుక్కోవచ్చు అని ఎగతాళి చేస్తున్నారు

ఒక్క స్టీల్ ప్లాంటే కాదు..రాజధాని, రైల్వే జోన్..ప్రత్యేక హోదా కూడా రాష్ట్రప్రభుత్వమే ఇచ్చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఎద్దేవా చేయవచ్చు కానీ..వాస్తవం అదే..చంద్రబాబు తలచుకుంటే ఏదైనా సాధ్యమే.. పునాదిరాయి.. ఆ తర్వాత గోడలు లేపడం..దాని తర్వాత స్లాబ్ వేయడం..తలుపులు బిగించడం
ఇలా ప్రతి పనీ ప్రపంచంలో ఒక్క టిడిపీనే చేయగలదు..చేస్తుంది అని వాదించగల సమర్ధులున్నంతవరకూ..ఇలాంటి తిరుమల మొక్కులు ఎన్నైనా తీర్చుకోవచ్చు తమకి చేతకాక కాదు..ఇన్నాళ్లూ ఊరుకుంది..కేంద్రం చేస్తుందా లేదా అన్నట్లు చూసాం అని చెప్పుకోవడానికే పనికివచ్చే ఇలాంటి పనులను పక్క రాష్ట్రంవాళ్లు ఎగతాళి చేస్తున్నారంటే చేయరా..అసలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నది ఎవరు..బ్రహ్మణిస్టీల్స్ ప్రొడక్షన్ కూడా ప్రారంభమయ్యే దశలో ఉండగా రాజకీయ కారణాలతో దాన్ని మూలబడేసి..మూసేసింది ఎవరు..ఈ ప్రశ్నలకు సమాధానం  చెప్పకుండా...ఊరికే కేంద్రంపై పడి ఏడవడమెందుకు..

Comments