ఇద్దరు ముఖ్యమంత్రుల తీరుతో జనం నవ్వుకుంటున్నారు బాబూ.. !


హైదరాబాద్ లో చంద్రశేఖర్ రావు గారు..అమరావతిలో చంద్రబాబునాయుడుగారు..ఒకరిపై ఒకరు బాగానే
దుమ్మెత్తిపోసుకుంటున్నారు..చక్రం తిప్పుతానని ఒకాయన అంటే..ఏంది నువ్ తిప్పేది..నేనే కారులో దూసుకుపోతా అంటానంటాడు ఒకాయన..అసలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరిపై ఒకరు ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎక్కడైనా ప్రస్తుతం జరుగుతున్నట్లు చూశారా..! రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, తమిళనాడు, చత్తీశ్ గడ్
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్..ఏ రాష్ట్రమైనా చూడండి..ఏ ముఖ్యమంత్రైనా పక్కనోడి పనిపై ఏనాడైనా దృష్టి పెట్టారా..(ఉంటే చెప్పండి సరి చేసుకుంటాం).

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాలుగైదు రాష్ట్రాలు తిరిగొచ్చారు సరే..అలుపు తీర్చుకున్న నాలుగు రోజులకు ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్కడికేదో ఆ టూర్ చంద్రబాబుపై విమర్శలు చేయడానికి అన్నట్లు..ఆ తిట్లేంటంట..బోకుపనులు..ఏం పీకిండు..ఈ పదాలేంటి..ఇవే మా సంస్కృతి..ఇట్లనే ఉంటది..అంటే ఎవడేం చేయలేడు..ఐతే పెరుగుట విరుగుట కొరకే అనే సామెత గుర్తుకుతెచ్చుకోవాలి..ఎందుకంటే..వైఎస్ కూడా రెండో టర్మ్ గెలిచిన తర్వాత ఇలానే ఆటాడుకుంటున్నా..రెండు నెలల్లో ఫినిష్ లాంటి పదాలు వాడారు..ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ..అహం పెరిగి..వళ్లంతా చేరకూడదు..మీరు పెట్టుకున్న టూర్ గురించి చెప్పుకోవచ్చు..అదేదో అందరికీ అర్ధం అవ్వాలన్నట్లుగా..ఏపీ రాజధానికి మోడీ చాలా ఇచ్చారు అనే అర్ధంలో మాట్లాడటమేంటి..

సరే కేసీఆర్ సారు..ఐతే బీ టీమ్ లేకపోతే.. ఎఫ్ టీమో అనుుకుందాం..దానికి ప్రతిగా చంద్రబాబుగారి తీరూ అంతే
ఏం మాట్లాడుతున్నాడు..అసలు వైస్రాయ్ హోటల్ స్క్రీన్ ప్లేనే కేసీఆర్ ది అంటూ గతం తవ్వుకోవడం ఏంటి..రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ విజయాలు కాంగ్రెస్ వి కాదు..నావే అని చెప్పుకోవడం చూస్తుంటే కేసీఆర్ సరిగానే మాట్లాడాడు అని కొందరైనా అనుకోరా..వాడిన భాష అభ్యంతరకరమేమో కానీ..అది వాస్తవం కాదా..నీతో కలిస్తేనేమో నీతిపరులు..లేకపోతే దగుల్బాజీలు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం వళ్లంతా కంపరం పుట్టించేదే..ఓ వైపు హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతుంటే..పేద్ద గొప్ప కార్యం చేసినట్లు..ఇద్దరం కలిసి పని చేద్దాం అని అడిగా చెప్పుకోవడం ఏంటి..ఛీ..నువ్వొద్దు పో  అంటున్నవాళ్ల చంకన దూరడానికి ఎందుకంత తాపత్రయం..జగన్ కేసీఆర్ కలవకూడదు
జగన్ పవన్ కలవకూడదు, జగన్ మోడీ కలవకూడదు..మోడీ కేసీఆర్ కలవకూడదు..కేసీఆర్ పవన్ కలవకూడదు..కానీ నీతో మాత్రం అందరూ కలవాలా..ఇదే జనం అడిగే ప్రశ్న..వీటికి సమాధానం చెప్పకుండా..ఊరికే ఘార్ఘిల్లితే ప్రయోజనం ఏంటి
అసలు ఇలా తిట్టుకుని మళ్లీ ఎట్ హోంలు..ఓపెనింగ్‌లలో కలిసినప్పుడు వాటేసుకుంటే జనం నవ్వరా..రాజకీయంగా తిట్టుకుంటాం అని కవర్ చేయవద్దు..మీరు చేసుకుంటున్న విమర్శలలో రాజకీయం కనబడుతుందా..వ్యక్తిగతం కన్పిస్తుందా..

Comments