మీ దగ్గర్నుంచి బ్యాంకులు పదివేల కోట్ల రూపాయలు లాగేశాయట


హెడ్డింగ్ చూసి కంగారు పడొద్దు..మనకి రావాల్సింది పదివేలకోట్ల రూపాయలు ఎక్కడుంటాయ్..మహా అయితే మన ఆస్తులే ఓ పాతిక లక్షలుంటాయేమో అనుకోవద్దు. టోటల్‌గా దేశంలోని జనాభా దగ్గర ప్రభుత్వ రంగ బ్యాంకులు  ఈమూడేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయనందుకు రూ.10వేలకోట్లు జరిమానా రూపంలో లాగేసాయట

ఇక  ఐసిఐసిఐ, హెచ్ డిఎఫ్ సి, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రవేట్ రంగ బ్యాంకులూ ఇంత పెద్ద మొత్తంగా కాకపోయినా..భారీగానే బొక్క వేసుంటాయ్. మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా డిసైడ్ చేసినా..ఫైన్ విషయంలో మాత్రం అన్నీ భారీగానే బాదేస్తున్నాయ్. ఏటిఎం ట్రాన్సాక్షన్స్ విషయంలోనే క్రూరంగా ప్రవర్తిస్తోన్న బ్యాంకులు ఆ రూపంలో ఇంకెంత లాగేశాయో తెలీదు.
ఇతర బ్యాంకు ఏటిఎంలు అయితే మూడు..సొంత బ్యాంకు ఏటిఎం ట్రాన్సాక్షన్స్ అయితే ఐదు వరకూ ఉచితంగా చేసుకోవచ్చని రూల్స్ పాస్ చేసింది ఆర్‌బిఐ. అంటే ఐదు ట్రాన్సాక్షన్స్ ముగిసిన తర్వాత మీరు ఐదువందల రూపాయలు డ్రా చేసినా..ఇరవై రూపాయలు టక్కున ఎక్స్ ట్రా కట్ అవుతుంది..ఇక్కడా కొన్ని బ్యాంకులు ఇరవైరూపాయల కంటే ఎక్కువే వసూలు చేస్తున్నాయ్.  జన్ ధన్ ఎక్కౌంట్లకి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన బెడద లేదు.
పార్లమెంట్లో కేంద్రమే ఇచ్చిన లెక్కలు ఇవి. దిబ్యేంద్రు అధికారి అనే ఎంపి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆర్ధిక మంత్రిత్వశాఖ తరపున వచ్చిన జవాబులో ఈ వాస్తవం బైటికి వచ్చింది.
 ఆర్బీఐ..జరిమానాల రూపంలో ఇఁత పెద్ద ఎత్తున ధనం సమకూర్చుకుంటున్న బ్యాంకులకు ఎందుకు ఆర్ధిక పరిపుష్టి చేకూర్చాలో అర్ధం కాదు. జనం ముక్కు పిండి జేబులకి చిల్లి పెడుతున్న బ్యాంకులు..అడ్డగోలుగా లోన్లు ఇవ్వడం ఆ తర్వాత వాటి నష్టాలను పూడ్చుకోవడానికి.. యూజర్లపైనే ఫైన్ రూపంలో ఆధారపడుతున్నాయని అనుకుంటే అది ఎవరి తప్పు

Comments