హాస్టల్ లో న్యూడ్ వీడియోలు షూట్ చేసిన బాలుడు..ఏం చెప్తుందీ ఇన్సిడెంట్


మాదాపూర్‌లో ఓ బాలుడు లేడీస్ హాస్టల్ లో దూరి..అక్కడి యువతులు స్నానం చేస్తుంటేనో..బట్టలు మార్చుకుంటుంటేనో వీడియో తీశాడట. చిన్న పిల్లాడు కదా..ఏదో కెమెరాతో ఆడుకుంటున్నాడు కాబోలు అనుకుని వాళ్లూ వదిలేసి ఉండొచ్చు..కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చూశారు కదా..మరి ఈ ఇన్సిడెంట్ ఏం చెప్తోంది..చుట్టూ ఏం జరుగుతుంటే..దాన్నుంచి నేర్చుకోవడమే మనిషి చేసేది అని అర్ధం కావడం లేదూ..

వాడి ఇఁట్లోనో..బైట స్నేహితులో( పెద్దవాళ్లు కూడా ఉండి ఉండొచ్చు) ఇదే పని చేస్తూ..వీడియోలు తీయడం అలవాటు అయి ఉంటుంది..పెతోడి చేతిలో స్మార్ట్ పోన్ ఉఁటే తప్ప మనిషి కాదన్నట్లు బిహేవ్ చేస్తున్న సమాజంలో..మరి స్మార్ట్ గా జీవితం ఇలానే ఉంటుంది..ఈ పిల్లపిశాచం గాడు..ఏ సెక్స్ వీడియోలో కూడా చూసి ఉండొచ్చు..అందుకే వాటిని తీసి ఎంజాయ్ చేస్తున్నాడనుకోవచ్చు..ఈ దృశ్యం గమనించినప్పుడు చిన్నపిల్లలు కదా అని ఏది పడితే అది మాట్లాడుకోవడం..ఏది పడితే అది చూస్తూ కూర్చోవడం తగదు అని అర్ధమవడం లేదా..ఇంకో పెద్ద విషయం ఏమిటంటే..చిన్నపిల్లలు కదా..అని మగపిల్లలను లైట్ తీస్కోవద్దు..రేపొద్దున్న 10ఏళ్ల పిల్లవాడు రేప్ చేశాడనే న్యూస్ కూడా వినాల్సి వస్తుందేమో..
జెన్యూన్..ఓపెన్ నెస్ పేరుతో వచ్చిపడే బోలెడు ఆర్ఎక్స్ 100లు..అర్జున్ రెడ్డిలు ఉండగా..మగాడంటే ఇలానే ఉండాలేమే అన్పించే ఇంకొన్ని సినిమాలు చూసిన పిల్లలకు అదే ఎక్కుతుంది..చెడు పని చేసిినంత వేగంగా మంచి ఎలా పని చేస్తుంది. పిల్లల ముందే బట్టలు మార్చుకోవడం, సరసాలు ఆడటం..ఇవన్నీ వాళ్లు సైలెంట్ గానే గమనిస్తారు..వాళ్లలోని మంచిని చెడు డామినేట్ చేసిన రోజున ఇవన్నీ అందుకు కారణభూతం అవుతాయి..ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు..అందరిదీ..అర్ధం చేసుకున్నవాళ్లకి అవుతుంది. లేనివాళ్లకి ఎప్పటికీ అవదు

Comments