క్రికెట్ ఆస్ట్రేలియా మనసున్నది కూడా గురూ..ఆర్చి షిరెల్ అందరి మనసులు గెలిచావ్



క్రికెట్ ఆస్ట్రేలియా..ఎంతో ఘన చరిత్ర కలిగినది..అంతకి మించి మనసున్నది కూడా అన్పించుకుంది. గుండెజబ్బుతో బాధపడుతోన్న ఓ ఏడేళ్ల చిన్నారికి ఏకంగా తమ జట్టులో చోటు ఇచ్చింది. ఎన్నో ఏళ్ల సాధన,అదృష్టం ఉంటే కానీ దక్కని ఈ అవకాశం ఆర్చి షిల్లెర్ అనే పిల్లాడికి దక్కింది


బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్‌లో ఓ యంగెస్ట్ మెంబర్ చేరాడు. ఆ క్యూట్ బాయ్ పేరు ఆర్చి షిల్లెర్. ముద్దు ముద్దుగా కన్పించే ఈ పిల్లవాడు నెట్ ప్రాక్టీస్‌లో కూడా బోలెడంత హడావుడి చేశాడు. అవడానికి 15వ ప్లేయరే అయినా.. ఇంతకుముందు ఎవరూ సాధించని ఘనత సాధించాడు. అత్యంత చిన్నవయసు అంటే ఏడేళ్లకే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. పైగా ఇతను మాజీ ఆటగాడు షేన్ వార్న్ ‌స్టైల్ అంటే తెగ ఇష్టపడతాడు..తనని తాను జూనియర్ వార్న్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడట.
ప్రతి ఏటా క్రిస్మస్ తర్వాతి రోజు బాక్సింగ్ డేగా పిలుస్తారు. ఆ టెస్టుని కంగారూలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి టెస్ట్‌లో ఆర్చి షిల్లెర్ ఆడటం వెనుక విషాదం ఉంది చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం..ఐతే శిశువుగా ఉన్ననాడే ఆర్చి షిల్లెర్‌కి అరుదైన గుండెజబ్బు సోకింది. ఆ తర్వాత ఐదారు ఆపరేషన్లు జరిగినా..పూర్తిగా కోలుకోలేదు. ఆ కారణంగానే షిల్లెర్ క్రికెట్ ధాటిగా ఆడలేడు. కానీ ఏనాటికైనా క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్‌కి కెప్టెన్ కావాలనేది అతని కల. ఈ విషయం తెలుసుకున్న మేక్ ఏ విష్..సంస్థ జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడింది.ఫలితంగా  ఇప్పుడు డిసెంబర్ 26నుంచి మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కి కో కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ దక్కింది



కోహ్లీని ఔట్ చేస్తానంటున్న ఆర్చి షిల్లెర్..మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ట్రోఫీ పట్టుకుని ఫోజులు కూడా ఇచ్చాడు. ఆర్చి షిల్లెర్ ఉత్సాహం చూస్తుంటే
అతని జబ్బుని అధిగమించే అవకాశం ఇవ్వాలని కోరుకోని వారుండరు

Comments