కేసీఆర్ ఓ విశాఖ టూర్ వయా స్వరూపానందేంద్ర టూ జగన్..ఏంటీ ఈక్వేషన్

ఒకప్పుడు రాజరిక వ్యవస్థలలో రాజపురోహితులు..రాజమంత్రాంగం నడిపేందుకు రాజగురువులు ఉండేవారు. ఆ తర్వాత రాజులు పోయారు..రాజ్యాలూ పోయాయ్. ఐతే రాజకీయాల్లో మాత్రం స్వాములకు నేతలకు మధ్య అవినాభావ సంబంధాలు నడుస్తూనే ఉన్నాయ్. ఖషోగ్గీలు..చంద్రస్వాములు..ఎన్టీఆర్ హయాంలో ఆయన జ్యోతిష్యులకు ఇచ్చిన ప్రాధాన్యత స్టోరీలు తెలిసినవారు చాలామందే ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం స్వాములు కేవలం తమ పీఠాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది క్రియాశీలకంగా పని చేయడంతో పాటు రాజకీయ నిర్ణయాలును కూడా ప్రభావితం చేస్తున్నారు..కొంతమంది రాజకీయాల్లోకి వచ్చేసారు కూడా.. 
ఐతే తాజాగా కేసీఆర్ స్వరూపానంద స్వామిని కలవడంలో ఆయన భక్తే జనాలకు పైన కన్పిస్తుందేమో కానీ లోన మాత్రం చాలా రాజకీయాలకు అక్కడ బీజం ఎప్పుడో పడిందంటున్నారు. మచ్చుకి ఈ కింద ఫోటో చూడండి

స్వతహాగా క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తాడనే పేరు ముద్ర పడిన జగన్..తొలిసారి ఓ స్వామి దగ్గరకు వెళ్లగా కన్పించిన వైనం..శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నాడు..అక్కడే ఆయనకు రాజకీయఉపదేశం కూడ ా జరిగిందనేవాళ్లున్నారు..ఎక్కడ ఎవరితో ఎలా నెగ్గుతూ..తగ్గుతూ వస్తే..షైనవ్వచ్చో..తెలుసుకునే వీలు కలిగిందంటారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ..త్రిదండి చిన జీయర్‌పై ఎన్ని విమర్శలు చేశాడో చూశారు..సన్నాసులకెందుకు రాజకీయాలు అని ఈసడించారు కూాడ..కానీ ఆ తర్వాత యాదగిరి గుట్టని యాదాద్రిని చేయడంలో...మూలవిరాట్టుని చుట్టూ ఆలయప్రాకారాల డిజైన్లలో నిర్మాణంలో జీయర్ వారికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారో గమనిస్తూనే వచ్చాం...అలాంటి చినజీయర్ కే జగన్ ఎలా నమస్కరిస్తున్నారో చూడండి


ఇలా చేయడం తప్పు కాదు..కానీ కలిపిన మనుషులు కూడా పైనే కన్పిస్తున్నారు చూడండి. వీళ్లంతా ఒకే స్వాములను కలవడం ఆశీర్వచనాలు తీసుకోవడం గమనిస్తుంటే భవిష్యత్ చిత్రం మూడో ఫ్రంటు రూపంలో కన్పించడం లేదా..!

Comments