బాబూ..శివా-జీ..లేట్ గా అయినా మంచి కామెడీ చిత్రం రిలీజ్ చేశావ్


హీరోలు..క్యామెడీ క్యారెక్టర్లు..ఇలా కష్టపడి పైకొచ్చిన శివాజీ ఈ మధ్యన కాస్త సినిమాలు తగ్గాయ్(తగ్గించుకున్నా అంటాడాయన) ఐతే..మళ్లీ చాలారోజుల తర్వాత మంచి కామెడీ చిత్రంతో వచ్చారాయన. ఐతే ఇది సినిమా కాదు..లక్ష్మీపార్వతి..ఎన్టీఆర్ టిడిపి వెన్నుపోటు అంటూ..ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ వాస్తవాలు చెప్తున్నారు..కానీ అది ఎంత నవ్వు పుట్టిస్తుందో చెప్పలేం..ఎందుకంటే వాజ్ పేయ్‌ని చంద్రబాబు నిలబెట్టారట..ఆ రోజున ప్రధానమంత్రిగా బిజెపి తరపున ఆయన్ని ..ఆయన పార్టీని నిలబెట్టడంలో వెన్నుపోటు పొడవడంతోనే సాధ్యమైందంటూ మాట్లాడటం చూస్తే పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుతున్నారు

అడ్డగోలుగా మాట్లాడటం..పైగా ఇది నా అభిప్రాయం..ఇది వాస్తవం..మీరు నమ్మండి నమ్మకపొండి..వినమని కూడా చెప్పట్లేదు అంటూ ఏదేదో మాట్లాడటం శివాజీ మానసిక స్థితిపై కాస్త అనుమానం కలిగించకమానదు..ముసుగు తీసేసి, టిడిపికి డైరక్ట్ గా మద్దతుగా మాట్లాడక..ఎందుకిలా..ఊరికి ఉపకారి మాటలు చెప్పడం..టిడిపి మనుగడ..వారికి..ఆయన వర్గానికి అవసరమేమో కానీ, జనాలకు ఏం అక్కర్లేదు..ఏదోక పార్టీని గెలిపిస్తారు..వారు చేసేదేదో వారు చేస్తారు..2014కి ముందూ ఇలానే నానా టెంటులు పెట్టుకుని చివరికి టిడిపికి సపోర్ట్ ఇచ్చినట్లు..ఇప్పుడు కూడా 2019కి ముందు మంచి వేషాలు వేస్తున్నారు.
ఓటర్లని దూరం చేయడం ఎలాగ..అంటూ ఎవరో ఏదో చేస్తారట..దాంతో టిడిపికి బ్యాడ్ అవుతుందట..అప్పుడు జనం ఓట్లు వేయరట..ఇది కేంద్రం ప్లానట..ఏమన్నా అర్ధం ఉఁదా..ఇక్కడే అర్ధం అవుతుంది కదా..ఎవరికి ఎవరు ఓట్లేస్తారని భయపడుతున్నారో..అసలు ఇలాంటి ప్లాన్లు ఎలా వస్తాయో తెలీదు ఈయనకి..ఓ రకంగా కేఎపాల్ ‌తర్వాత ఈయనే అన్పించకతప్పదు..తాము చేయలేనిది..ఇలా కేతిగాళ్లచేత చంద్రబాబు చేయిస్తుంటాడని ఉండవల్లి చెప్తారు..అది నిజమేనేమో అన్పించకతప్పదు.. లేకపోతే..వెన్నుపోటు గురించి..ఇప్పుడు నిన్నెవడు తీర్పు అడిగాడు..వెన్నుదన్ను అట..ఇలాంటి కామెంట్లు..సమర్ధనలు..అన్నీ గత ఇరవైఏళ్ల నుంచి ఓ వర్గం ఓ కులం బలంగా చెప్తుంటుంది..ఇదే వాదన ఈయన విన్పించడంలో ఆశ్చర్యం ఏముంది
ఈ కింద ఓ వీడియో లింక్ ఉంది. వీలైతే ఓ సారి చూడండి

Comments

  1. సినిమా బాగుందంటే అది నటుడి గొప్పతనం కాదు దర్శకుడి ఘనతే. గరుడ శివాజీ తాజా కామెడీ సినిమా దర్శకుడు ఎవరో మరి?

    ReplyDelete

Post a Comment