రఘువీరాగారూ..మీరు రాష్ట్రానికేమో కానీ..కాంగ్రెస్‌కి అవసరం..


ఎన్నికలకు ముందు శపధాలు చేయడం..తర్వాత భంగపడటం గత 20ఏళ్లలో సామాన్యమైపోయింది..ఇలాంటి ప్రగల్భాల లిస్టులో హేమాహేమీలు కూాడ ఉన్నారు..ముందుగా 1998 వరకూ వెళ్తాం..అంతకు ముందు కూడా ఇలాంటి ఉత్తరప్రగల్భాలు పలికినా..ఓ ఇరవైఏళ్లు కాస్త హేతుబద్దంగా ఉంటుంది( ఆ చేసినవాళ్లు బతికి ఉన్నారు కాబట్టి) అప్పటి మధ్యంతర పార్లమెంట్ ఎన్నికలలో గుంటూరు జిల్లాలో ఇప్పటి సభాధ్యక్షుడిగా ఉన్న ఓ లీడర్ అన్నీ మేమే గెలుస్తాం..రాష్ట్రంలోనూ..జిల్లాలోనూ..ఇది తప్పకుండా మా పాలనకు రెఫరెండమే అన్నాడు..ఫలితం చూస్తే..పాపం బొక్క బోర్లాపడింది..గుంటూరు జిల్లాలోనే నరసరావుపేట, తెనాలి, గుంటూరు, బాపట్ల నాలుగు ఎంపీలు కాంగ్రెస్ గెలిచాయ్. నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ఈ విషయంపై అడిగితే..రెఫరెండం అన్నదీ ఆ నోరే..రాజకీయ సన్యాసం చేస్తానన్నదీ ఆ నోరే..కాబట్టి మీరెళ్లి ఆయన్నే అడగండి అని సెటైరేశారు..

1999లో కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా..చంద్రబాబూ నువ్వూ సిధ్దమా టిడిపి గెలవకపోతే నువ్వూ రాజకీయాలనుంచి తప్పుకుంటావా..అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు..ఐతే ఆయన ఖచ్చితంగా చంద్రబాబుని కూడా పందెం ఒప్పుకోవాలనే పదే పదే షరతు పెట్టారు..కాబట్టి..వైఎస్ సవాల్ కి కాస్త మినహాయింపు ఇవ్వవచ్చు..2004లో కూడా ఇదే సవాల్ విసిరారాయన. కాకపోతే..ఈసారి చంద్రబాబు సంసిద్ధతతో సంబంధం లేదు..ఇది వన్ సైడ్ ఛాలెంజే..కాంగ్రెస్ గెలవకపోతే తప్పుకుంటా..అన్నారు..అన్నట్లుగానే కాంగ్రెస్ ని గెలిపించారు..

కట్ చేస్తే..2018లో పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీయనని..గాంధీభవన్కే వెళ్లనని బీరాలు పలికారు..100సీట్లు రాకపోతే కేటీఆర్ తప్పుకుంటాడా అని కోమటిరెడ్డి ఛాలెంజ్ చేశాడు..రెండూ జరగలేదు.. ఇప్పుడదే విధంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో అడుగుపెట్టను అంటూ ఓ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉఁది. అసలు హోదా ఇవ్వనిది కాంగ్రెస్సే..ఆ ఇవ్వకపోవడమే వాస్తవాన్ని బిజెపి-టిడిప కూటమి కలిసికట్టుగా కొనసాగించింది.

అడిగినవాళ్లు దుర్మార్గులు , మెదడు లేనివాళ్లలా చిత్రించిన టిడిపితో కాంగ్రెస్ అంటకాగిన విషయం చూశాం..ఇప్పుడు రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో అడుగుపెట్టను అని చెప్పడమేంటో వింతగా ఉంది..అయ్యా రఘువీరారెడ్డి గారూ..మీరు రాష్ట్రానికి అవసరమో కాదో చెప్పలేం కానీ..కాంగ్రెస్ కి మాత్రం అవసరం కాబట్టి శపథాలు చేయకండి సర్

Comments