పెళ్లాం కన్య..ఓ సీల్ట్ బాటిల్ అట..ప్రొఫెసర్ పైత్యం


నోటికి వచ్చినట్లు మాట్లాడి కెరీర్ సందిగ్ధంలో పడేసుకున్న క్రికెటర్ల ఉదంతం మరవకముందే..మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడో ప్రొఫెసర్..కోల్‌కతా జాదవ్ పూర్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న కనక్ సర్కార్ అనే వ్యక్తి కన్యలను పెళ్లి చేసుకుంటున్నామంటూ యువకులు భ్రమల్లో బతుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు..దీనిపై నిరసన వ్యక్తం కావడంతో దాన్ని కాస్తా డిలీట్ చేసి..కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు

వర్జిన్ బ్రైడ్..అంటే కన్య అయిన పెళ్లి కూతురు అనే అంశంపై కనక్ సర్కార్ అనే ప్రొఫెసర్ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరంగా
పోస్టులు పెట్టాడు..తన వృత్తి బోధన అయినంత మాత్రాన ఏం మాట్లాడినా చెల్లుతుందనుకున్నాడో ఏంటో కానీ..దానిపై ఏకంగా పెద్ద  లెక్చరే తన పోస్టులలో పొందుపరిచాడు. జాదవ్ పూర్ యూనివర్సిటీలో గత ఇరవైఏళ్లుగా అంతర్జాతీయ సంబంధాలపై లెక్చర్లు ఇస్తోన్న ఇతగాడు దేశీయంగా మాత్రం ఎలాంటి రిలేషన్స్ మెయిన్ టైన్ చేయాలో తెలుసుకోలేకపోవడం విచారం. వేల్యూ ఓరియెంటెడ్ సోషల్ కౌన్సిలింగ్ అంటూ చాలామంది యువకులకు తాము కన్యలను పెళ్లి చేసుకోవాలనే విషయం కూడా తెలీదంటూ తన పైత్యం ప్రదర్శించాడు. వర్జిన్ అంటే
ఓ సీల్డ్ ప్యాకెట్..సీల్డ్ బాటిల్ అంటూ పనికిమాలిన పోలికలు తెచ్చాడు. దీంతో ఇతగాడి పోస్ట్ చూసిన చాలామందికి వళ్లు మండుకొచ్చింది..రివర్స్ ట్రోలింగ్ ప్రారంభించడంతో..వెంటనే తన పోస్టు డిలీట్ చేశాడు


ఆ తర్వాత తిరిగి తన చర్యని సమర్ధించుకునేలా పోస్టులు పెట్టాడు. వ్యక్తిగత స్వేఛ్చ తనకి ఉందని..ముందు చెప్పుకున్నాడు..ఐనా ట్రోలింగ్ ఆగకపోవడంతో.. తనకి మహిళలపై గౌరవం ఉఁదంటూ ఏకరువు పెట్టాడు. ఎవరైనా కేసులు పెడతారనే భయంతోనే కనక్ సర్కార్ ఇలా కవరింగ్ పోస్టులు పెట్టినట్లు అర్ధమవుతోంది.
అనేక దేశాల ప్రొఫెసర్లతో కలిసి ఇంటర్నేషనల్ ఐటెమ్స్‌పై లెక్చర్లిచ్చే కనక్ సర్కార్ నిజస్వరూపం బైటపడటంతో..అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే..అది ఎవరినీ హర్ట్ చేయకూడదని అంతేకానీ..తన అభిప్రాయాలను ఇష్టారాజ్యంగా సమాజంలోకి వదలమని కాదు.

Comments