షర్మిలపై దుర్మార్గపు ప్రచారం వెనుక టిడిపి ఉందా..రాజేంద్రప్రసాద్ స్పందన ఏం చెప్తోంది


సోషల్ మీడియా..అంటే..అదో బురద అనుకునేవారికి లోటు లేదు.ఎందుకంటే ఏదోక పోస్టు పెట్టడం..శునకానందం పొందడం ..మరీ శృతి మించితే పోస్టులు..అక్కౌంట్లు డిలీట్ చే సుకుని పరారీ అవడం..దుర్మార్గాలపై అంటే..కాస్త అర్ధం చేసుకోవచ్చు..కానీ లేకిగా..మానసిక జాడ్యాలను బయటపెట్టుకునేందుకు ఫేస్ బుక్..ట్విట్టర్లను ఆశ్రయించడం వాట్సాప్‌లో వాటిని ఫార్వార్డ్ చేసుకుంటూ..అర్జ్ తీర్చుకోవడం మాత్రం క్షమించరాని తప్పిదాలే..

షర్మిలపై గత ఐదేళ్లుగా జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే(సోషల్ మీడియాజనులకు). నిజంగా వైఎస్ జగన్ తలుచుకుంటే కేసులు పెట్టడం వెంటనేే సదరు కేటుగాళ్లని పట్టుకోవడం రోజుల్లో జరిగే పనో..ఎందుకో మరి ఆ విషయంవైపు పార్టీ కానీ..లీడర్లు కానీ దృష్టి పెట్టలేదు..పైగా ఎందుకు పెంటగాళ్లతో కూడా అనుకుని ఉండొచ్చు..కానీ ఇప్పుడు మాత్రం షర్మిల పోలీస్ కేసు పెట్టి మంచి పనే చేసింది. దీంతో ఎవడు పోస్ట్ పెట్టాలన్నా వణుకుతాడు..ఎందుకంటే..సైబర్ క్రైమ్ కింద బొక్కలో పడి మక్కెలు విరగ్గొట్టించుకునేంత ధైర్యం ఈ షాట్ మాటు షేర్ చాటుగాళ్లకి ఉండదు..ఓ వేళ పట్టుబడితే..వాళ్ల వెనుక ఉన్న లుచ్చాగాళ్లు బైటపడతారు..లేదంటే ఒంటరిగా వీళ్లే బుక్కైపోతారు..ఒక్క షర్మిల విషయమే కాదు..కాస్త అందంగా ఉండి..సెలబ్రెటీ స్టేటస్ ఉన్న ప్రతి లేడీపైనా ఇలానే తమ సొల్లు కార్చేవాళ్లకి ఈ కేసు విచారణ ఓ పాఠం అవుతుంది..

పొలిటికల్ పంచ్ పేరుతో ఓ వ్యక్తి కార్టూన్లేస్తున్నాడని అప్పట్లో అమరావతిలో అరెస్ట్ చేశారు..అప్పుడే టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తనకి సంబంధం లేని విషయంలో తనకేదో తెలుసున్నట్లుగా వాగుతూ..వాసిరెడ్డి పద్మ గడ్డి పెట్టడంతో సైలెంట్ అయ్యాడు..ఇప్పుడు మళ్లీ..అదే రీతిలో మాకేం సంబంధం అంటూ పైనుంచి కిందదాకా..ప్రతి టిడిపి మంత్రీ మాట్లాడేస్తున్నారు..నిజంగా టిడిపికి సంబంధం లేకపోతే..అదే తేలుతుంది కదా..కేసు విచారణలో..ఆ మాత్రం దానికి రాజేంద్రప్రసాద్ స్పందన చూస్తుంటే..దొంద దొరికినట్లే అన్పిస్తుంది

ఇక షర్మిల కామెంట్స్ పై పోలీస్ సంఘాలు స్పందించాయట..ఏం మరి జేసీ గారు పోలీసులను నానాబూతులుూ తిడుతుంటే లేవని గొంతు..ఇప్పుడెందుకు లేస్తోంది..నమ్మకం లేదనడం బూతేం కాదే..అంత నమ్మకస్తులే అయితే గతంలో పెట్టిన కేసులో విచారణ ఎందుకు చేయలేకపోయారు..కడుపు చించుకుంటే..పడేది మీ కాళ్లపైనే పోలీస్ బ్రదర్స్..అటు ఏపీ బ్రామణ కార్పొరేషన్ పెద్దాయన స్పందిస్తున్నాడు..అసలు అతగాడికి ఏం సంబంధం ఉందని మాట్లాడతాడు..పోలీస్ శాఖనా..లేక షర్మిల బంధువా..లేక టిడిపి తరపున వత్తాసా..ఇలా వరసగా తప్పుడు స్పందనలతోనే..కేసులో ఎవరు ముద్దాయిలో వారికి వారే బైటపడుతున్నారని ఓ మిత్రుడు అంటున్నాడు..నిజమేనా మరి 

Comments