డ్వాక్రా మహిళ అనేది బాబుగారి బ్రెయిన్ చైల్డ్ అట


చంద్రబాబుగారు ఏం మాట్లాడినా..ఆహా ఓహో అనే బ్యాచ్ తక్కువేం కాదు..వినేవాళ్లుంటే చెప్పేవాళ్లు చంద్రబాబులవుతారని జోకులు కూడా వేస్తుంటారు కొందరు..ఎందుకంటే..ఆయన కానిది..ఆయన వల్లకానిది అసలు ఏదీ లేదన్నట్లు మాట్లాడటంలో ఆయనకి ఆయనే సాటి..అందుకే 2003లో వైఎస్ రామోజీరావ్ గారి పత్రికకి ఓ భారీ లేఖ రాశారు..అందులో బిల్ గేట్స్ కి కంప్యూటర్ పాఠాలు..సచిన్ కి క్రికెట్ నేర్పింది కూడా బాబే అని చెప్తాడు..దాన్ని మీ పత్రికకి మీకూ వాస్తవమనిపించవచ్చు..భజన చేయవచ్చు ..అంటూ దాదాపు 7 పేరాల లేఖ గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు అలానే తిత్లీ తుఫాన్ ని అడ్డుకున్నానంటాడు..బ్రిటీషర్లతో పోరాడిన పార్టీ టిడిపి అంటారు..కర్నాటకలో బిజెపిని ఓడించామంటాడు..మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందంటే దానికి తానే కారణమంటాడు..ఇలా ఎన్ని అబద్దాలు చెప్పినా...ఆయన్నే ఫాలో అయ్యేవాళ్లు అవుతారు..ఎవడి పిచ్చ వాడికి ఆనందం అనుకోవాల్సిందే..కానీ వైఎస్సార్ గతంలో అటకెక్కిన ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి తిరిగి జనంలోకి తెచ్చిన వాటినీ సిగ్గు లేకుండా తన మానసపుత్రికలుగా చెప్పుకోవడంలో కూడా పోటీ పడతారీయన.

ఇవాళ అదే కోవలో డ్వాక్రామహిళలనే కాన్సెప్ట్ ఈయనగారి మానసపుత్రిక అంటూ కోతలు కోసేశారు..ఇప్పుడే కాదు..గతంలోనూ ఇలానే మాట్లాడితే 1999..2004 సమయంలో ఓ పేపర్ ఝాడించింది కూడా..అసలు వాస్తవానికి డ్వాక్రా అనే కాన్సెప్ట్..పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన కాన్సెప్ట్..ఇప్పటికీ ఈ సంఘాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తుందని చెప్తుంటారు..అలాంటప్పుడు ఆ కాన్సెప్ట్ ఈయనదే అని ఎలా డబ్బా వాయించుకుంటారు..పైగా..ఎవరి జేబులో సొమ్మో ఇస్తున్నట్లు..రెండు నెలలు 10వేల చొప్పున 20వేలు ఈ రెండు నెలల్లో ఇవ్వబోతున్నారట..

అక్కడ కేసీఆర్ రైతుబంధు పేరుత ో ఎన్నికలకు ముందు చెక్కుల పంపిణీ చేసారు..ఇక్కడ ఇప్పుడు దానికి ఆయన రెట్టింపు సొమ్ముతో ఓట్లని కొల్లగొట్టే ప్రయత్నం అని అర్ధమవుతూనే ఉంది..ఐతే తెలీని విషయం ఏమిటంటే..ఇంత డబ్బు ఎలా వస్తుంది..దాదాపు కోటిమంది మహిళలు నిజంగా డ్వాక్రా సభ్యులుగా ఉన్నారా...ఇలా డ్వాక్రా మహిళలే 98లక్షలమంది ఉంటే..ఉద్యోగస్తులు ఎంతమంది ఉండాలి...రోజు వారీ కూలీలు ఎంతమంది ఉండాలి..ఈ లెక్కల్లో ఏదే తేడా కన్పిస్తుంది..సరే దాన్ని వదిలేద్దాం..రూ.9400కోట్లు నిజంగా ఈ పరిస్తితుల్లో ఎక్కడ్నుంచి తెచ్చారు..ఇక్కడ ఇప్పుడు ఉద్యోగుల జీతాలకే ఓడీకి వెళ్లబోతుంటే..ఇంత డబ్బు రెండు నెలల్లో ఎలా ఇవ్వబోతున్నారు..ఇక్కడ కూడా ఓ వాదన ఉంది..ఇది డబ్బు కాదని..పోస్ట్ డేటెడ్ చెక్కులని..చెక్కులైతే ఏంటి..డబ్బులైతే ఏంటి..మొత్తం మీద రూ.9400కోట్లు అప్పనంగా ఓటర్లకి పంచినట్లే భావించాలి..ఇదేదో టిడిపి మీద పడి ఏడవడం లేదు..మెడకాయ్ మీద బుర్రున్న వాడికి సులభంగా అర్దమవుతుంది ఈ లాజిక్..ఎన్నికలకు ముందు మాత్రమే సాయం చేయాలని గుర్తొచ్చిందా..సరే..మరి అన్ ఎంప్లాయెడ్ యూత్..అలవెన్స్ ఎంత పంచుతున్నారో కూడా చెప్పాలిగా..సరిగ్గా ఎన్నికలకు ముందు గుర్తొచ్చినట్లు..హామీలు నెరవేరుస్తున్నాం అనుకుంటూ..ప్రకటించిన ఆ నిరుద్యోగభృతి ఎప్పుడు ఎంతమందికి ఇచ్చారో కూడా చెప్పాలిగా..ఇచ్చిన ఊకదంపుడు హామీ్ల గురించి అడుగుతుంటే..పార్టీ కార్యకర్తలకు నొప్పి కలగడం సహజమే

Comments

  1. 94 లక్షల స్మార్ట్ ఫోనుల హామీ డ్వాక్రా మహిళల బాగు కోసమా లేక సదరు ఫోను కంపెనీలు ఇచ్చే అమ్యామ్యాలతో తమ చేతులు తడుపుకోవడానికా ఎవరికి తెలీదు?

    అసలు అయిదేళ్ల కిందటే ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ అమలు చేస్తే మహిళలే తమకు ఇష్టం వచ్చిన ఫోను కొనుక్కుంటారు కదా. పసుపు కుంకం రొక్కమే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఫోను కంపెనీలకు అప్పణంగా ప్రజాధనం కట్టబెట్టడం దేనికి?

    ReplyDelete

Post a Comment