చందాకొచ్చర్ చుట్టూ ఉచ్చు


ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈఓ కమ్ ఛైర్మన్ చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చు బిగిసింది. తన పదవిని అడ్డుపెట్టుకుని భర్తకి లాభం చేకూర్చేలా వ్యవహరించారంటూ ఆమెపై సిబిఐ ఎఫ్ఐర్ నమోదు చేసింది..ఇదే ఎఫ్ఐఆర్‌లో ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండి వేణుగోపాల్ దూత్‌పై కూడా ఆరోపణలు చేర్చారు. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ 3250 కోట్ల రుణం మంజూరైంది. తర్వాత  కొద్దినెలలకే ఆ కంపెనీ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ చందాకొచర్‌ భర్తకు చెందిన న్యూపవర్‌ సంస్ధలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రో వ్యవహారంగా  దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. దాంతో ఐసిఐసిఐ బ్యాంక్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరిపిస్తామని..చందా కొచ్చర్ తప్పులేదని నమ్మబలికింది. కానీ తర్వాత  సెబీ చేపట్టిన ప్రాధమిక దర్యాప్తులో  దీపక్‌ కొచ్చర్  వీడియోకాన్‌ గ్రూప్‌తో పలుమార్లు వ్యాపార సంప్రదింపులు జరిపినట్టు వెల్లడైంది. దీంతో చందా కొచ్చర్ సెలవుపై వెళ్లడం ఆ తర్వాత పదవి నుంచి తొలగడం జరిగిపోయాయ్.

తాజాగా సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చందాకొచ్చర్ పేరు చేర్చడంతో అత్యున్నత పదవి నుంచి..చివరికి అనూహ్యంగా అప్రతిష్ట పాలవ్వాల్సి వచ్చింది. ఇక కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా ముంబైలో వీడియోకాన్‌ కార్యాలయాలు, ఔరంగాబాద్‌లోని న్యూపవర్‌, ముంబై నారిమన్‌ పాయింట్‌లోని సుప్రీం ఎనర్జీ కార్యాలయం సహా పలుచోట్ల సీబీఐ తనిఖీలు చేసింది. తొందర్లోనే అన్ని ఆధారాలతో నిజం నిగ్గు తేలుస్తామని సిబిఐ చెప్తోంది..ఇలాంటి పరిణామాలు చూసినప్పుడే..ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న ఎవరైనా..ఆ స్థాయికి రావాలంటే..ఏదోక స్కామ్ చేయడమో..వచ్చిన తర్వాతా చేస్తారనే అనుమానాలు బలపడుతుంటాయ్

Comments