వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఎన్టీఆర్ మనవడు


ఎన్టీఆర్ మనవళ్లు మనవరాళ్లు అంటే కేవలం జూ ఎన్టీఆర్..తారకరత్న..బ్రహ్మణి, లోకేష్ లే కాదు..ఇంకా ఉన్నారు..అలాంటివారిలో మొదటగా రాజకీయాల్లోకి వచ్చేశాడు దగ్గుబాటి హితేష్..అటు మంచి వక్తగా పేరుపొందిన పురంధీశ్వరి తల్లి..ఇటు టిడిపిలో సుదీర్ఘకాలం పని చేసి..సడ్డకుడు కొట్టిన దెబ్బకి రాజకీయాల్లోంచి విరమించుకున్న తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావ్ గారి వారసుడిగా..తెలుగుదేశంలో అయితే మంచి పునాది పడి ఉండేది..కానీ కావాలనే ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం వెనుక రెండు విషయాలు బైటికి చెప్పుకోవచ్చు..
ఒకటి చంద్రబాబు అంటే పడకపోవడం..రెండు టిడిపి ఓడిపోతుందనే అంచనాతో..

ఐతే పార్టీలో చేరిక సందర్భంగా ప్రతి లీడరూ చెప్పేమాటలే..దగ్గుబాటీ చెప్పారు..కానీ ఇక్కడ విశేషం ఏంటంటే..దగ్గుబాటి వెంకటేశ్వరరావ్ పాలిటిక్స్ లో లేరు..పురంధీశ్వరి గారు అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటారంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పడమే బాధాకరం..కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీలో ఉన్నంతమాత్రాన..పూర్తిగా పాలిటిక్స్ నుంచి విరమించుకుంటామని..ఆమె తరపున ఈయన చెప్పడం తప్పు..నిజంగా వారిదంతా ఒకటే మాట అయి ఉండవచ్చు కానీ..ఆమెకి ఏ పార్టీలో అయినా సముచిత స్థానం దక్కుతుంది..ఇలా కేవలం వారసుడి ఎంట్రీ కోసం రాజకీయ భవిష్యత్తుని బలి చేయకూడదు..

ఇక పైన చెప్పిన మాట.." మేం విన్న జగన్ వేరు..చూసిన జగన్ వేరు ".వైఎస్సార్ కాంగ్రెస్ లో జాయినయ్యే ప్రతి లీడరూ ముందు ఇలా చెప్తారు..కానీ తర్వాత పార్టీనుంచి వెళ్లే ముందు మాత్రం "అక్కడంతా నియంతృత్వం..మేం ఇమడలేం..ఆయన తీరు మార్చుకోవాలి.." ఇలా సాగుతాయి మాటలు..నిజమేమిటనేది..ఆ పార్టీలో ఉండి దగ్గరగా గమనించేవాళ్లకే తెలియాలి..ఎన్నికల ముందు పెద్ద కుటుంబం..పేరున్న కుటుంబం నుంచి నేతలు..అందులో కొత్త తరం చేరడం ఏ పార్టీకైనా మంచిదే..కానీ..ఇక్కడే ప్రత్యర్ధి పార్టీల విమర్శలూ గుర్తుంచుకోవాలి..ఎటూ బిజెపి..వైఎస్సార్సీపీ కలిసిపోయాయి కాబట్టి..అందుకే ఆమె అక్కడ..తనయుడు ఇక్కడ అంటూ అర్దాలు తీస్తారు..ఆ లెక్కన కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండే సందర్భాలు ఎన్ని లేవు

Comments