వెంకటేష్..ఆర్ యూ ఓకే..!

తెలుగు తెరపై మూడు దశాబ్దాలుగా అలరిస్తున్న నటడు వెంకటేష్..ఈ మధ్యనే ఎఫ్2 అనే సినిమాతో తన టైమింగ్..రైమింగ్‌ని చూపించి మంచి మార్కులు కొట్టేసారు.. అప్పుడే ఈయనకి 60 ఏళ్ల వయసు వచ్చిందంటే అస్సలు నమ్మబుద్దికాదు. కళ్లముందు కాలం అలా గడిచిపోతూ ఉంటే..యువకులు..మధ్యవయస్కులు..వృధ్దులు అయిపోతూ ఉన్నా..సినిమావాళ్లకి మాత్రం అలా రాదు..వచ్చినా మనకి జీర్ణించుకోవాలనిపించదు..



పైన ఫోటోనే చూడండి..తన వయసులో సగం ఉన్నవారితో ఎలా కలిసి పోయి ఆడుతున్నాడో..ఇలాంటి వెంకీకి వెన్నునొప్పి బాధిస్తుందని..అందుకని ఓ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని ఓ వార్త తిరుగుతోంది..ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ..40 ఏళ్లు దాటితేనే నడుంనొప్పి..కీళ్లనొప్పులు వస్తున్నాయ్. అలాంటి సమయంలో 60ఏళ్ల వెంకీకి కాస్త నొప్పి రావడం పెద్ద విషయం ఏమీ కాదు..పైగా చాలారోజుల తర్వాత ఎఫ్2 మూవీలో ఫాస్ట్ మూమెంట్స్ చేసాడు.
సినిమాలు చేస్తున్న సమయంలో తప్ప బైట పెద్దగా కన్పించని వెంకీ ఎవరికీ  అటాచ్ మెంట్ పెట్టుకోనని ఆయనే స్వయంగా చెప్తుంటాడు..ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చూపించే వెంకీ..బైట మాత్రం అస్సలు అలా కన్పించడు..బైట విగ్ లేకుండా అస్సలు రాడు..ఈ విషయాలన్నీ పక్కనబెడితే..మంచి సక్సెస్ సాధించిన వెంకీ హ్యాపీగా ఉండాలని విష్ చేద్దాం..

Comments