వెకిలీ...వాళ్లంతా కూడా రాజమండ్రి వచ్చారా...మేం కూడా జస్ట్ కామెడీ చేస్తున్నాం


ఓ రెండక్షరాల నటుడు...అతను ఆ మతంవాడని గట్టిగా గుర్తు చేస్తే కానీ అందరికీ తట్టదు..అంతగా తెలుగువాళ్లు సొంతం చేసుకున్నారు..సొంతం చేసుకునేదేంటి అసలీ పదమే తప్పు..40ఏళ్లు ఇండస్ట్రీలో ఉండి మరి అక్కడి వాగుడికి అలా తయారయ్యాడో..లేక ఇండస్ట్రీలోని వాళ్లంతా కూడా ఈయనలానే బూతులు మాట్లాడుకుంటారో తెలీదు కానీ..మనోడిలో బూతుపాళ్లు ఎక్కువ..అదేమింటంటే..అందరూ అంతే ఏదో నవ్వించడానికి అలా చేస్తా కానీ నేను చాలా ఫ్యామిలీ టైపు..అంటూ ఏదేదో చెప్పి..సమర్ధించుకునే ప్రయత్నం చేస్తాడు..

కేవలం నటుడు..హాస్యనటుడు అనే కోణంలో వదిలేస్తున్నారు కానీ..ఇంకోళ్లైతే ఈపాటికే కనీసం 12 కేసులు పెట్టేవాళ్లు..(పెట్టమను చూద్దాం అని కూడా అంటాడు). ఈ మధ్య వరసగా అన్ని పార్టీలను తెగ కలిసేస్తూ..రాజకీయసేవకి కూడా తయారయ్యాడు.మరి జనం ముందుకు వస్తున్నాడు కదా..కాస్తైనా తన మకిలి తగ్గించుకోవాలి కదా..అబ్బే అదేం కుదరదు..నా ఇష్టం అన్నట్లుగా తయారయ్యాడు.

లేకితనానికి నేనేం తక్కువ కాదు..కేవలం ఈ మధ్య కాస్త తగ్గా అన్నట్లుగా ఓ ఆడియో ఫంక్షన్లో..ఓ యాంకర్ ని పట్టుకుని..మీ ఆయన అక్కడికి వెళ్లాడా..ఈ హీరో పేరు మీ కొడుకు పేరు ఒకటే అంటూ నోట్లోని దరిద్రాన్ని..కుమ్మరించాడు..ఇదే కామెడీనా..దీన్నే నవ్వుకోవడం అంటారా..బాబూ మేం సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం కానీ...నువ్ సినిమాలో పండించే వెకిలి మకిలి మా జీవితాల్లో ఉంటుందని చెప్పకు..అక్కడికేదో మా బతుకులని చూసి మీరు సినిమాలలో తీస్తున్నట్లు అడ్డగోలు సమర్ధనలు ఎందుకు..

నేనూ ఒకటి అడుగుతున్నా..నిన్నూ చాలామంది " నా కొడుకులాంటి వాడివి " అని ఉండొచ్చు కదా..వాళ్లంతా కూడా గతంలో మీ ఊరొచ్చారా బాబూ..! ఎందుకు నీ సిగ్గుమాలిన జన్మ..నీకు రాజకీయాలు కావాలా..రా..జనం ఉన్న డబ్బులు ఊడగొట్టి  పంపించకపోతే చూడు

Comments