ఈ దేశంలో ఎవడి ఇష్టానికి వాడు కరెన్సీ నోట్లను రద్దు చేసుకోవచ్చు..ప్రింటింగ్ ఆపేయవచ్చు


అనగనగా.. ఓ దేశం..
అక్కడ కరెన్సీ ఎప్పుడు  పడితే రద్దు చేయవచ్చు..మళ్లీ ప్రింట్ చేసుకోవచ్చు..చలామణీలో ఉన్నా డబ్బుని ప్రభుత్వం ప్రమేయం లేకుండానే నిలిపివేయవచ్చు.. ఇదేదో బానే ఉందే అనుకోవచ్చు కదా..కానీ ఇలా చేయడం వలన మందబలం ఉన్నవాళ్లకే కానీ కష్టాలు పడుతూనో...కాస్త సుఖపడుతూనో డబ్బు సంపాదించేవాళ్లకే కదా అన్ని కష్టాలు..చలామణీలో ఉన్న డబ్బు గురించి ఎవడో ఎక్కడో నాకో సోర్స్ ఉఁదంటూ ...ఫలానా నోటు ఇక రాదట..అని రాస్తాడు..దాన్ని పట్టుకుని నాలుగు పేద్ద..ఛానళ్లు ఊదరగొడతాయి..మరి దాన్నే పట్టుకుని ఇఁకో బాకా చానళ్లు తామే ఆ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లైనట్లు హడావుడి చేస్తాయ్..ఏ రోజూ ఎప్పుట్నుంచి ఎందుకు ప్రింటింగ్ ఆపుతుందో కూడా తమకే ముందు తెలిసినట్లు చెప్తుంటారు..
మర ిమధ్యలో డబ్బులు సంపాదించుకుంటున్నవాళ్లు ఏం చేయాలంటారా...ఏం చేస్తారు..ప్రింటింగ్ ఆపేశారు కాబట్టి. బ్యాంకుల్లో ఏటిఎంలలో డబ్బులు వస్తున్నా..పట్టించుకోకుండా..ఇక ఆ నోట్లు చెల్లవనే నిర్ణయానికి రావాలి..వచ్చి ఎక్కడిక్కడ తన్నులాటలకు  దిగాలి..అప్పుడు మళ్లీ మనమే కావాల్సినంత చెత్తా చెదారం పోగేసి..చలి మంటలు కాచుకుంటూ..బ్రేకింగులు వేసుకోవాలి. రేటింగులు పెరుగుతాయి..పైశాచిక ఆనందం పొందుతూ..చూశావా నా ప్రతిభ అన్నట్లు పక్కనోళ్లవైపు చూస్కుంటూ రోజులు గడపాలి..ఇదే దేశమో తెలుసు కదా..


2016 నవంబర్ 8 అందరికీ గుర్తుండి పోయే రోజు..ఓ వేళ మర్చిపోయినా న్యూస్ ఛానళ్లు..పేపర్లు మర్చిపోనివ్వవు..కరెన్సీ నోట్లని రద్దు చేస్తూ వెలువడిన నిర్ణయం దెబ్బకి మేధావులు ఓ వైపుకి..పామరజనం( మాలాంటివాళ్లు) ఓవైపుకి చీలిపోయి తెగ వాదించుకున్న రోజు..దేశానికి మంచి చేస్తుందంటూ వాళ్లు చెప్పడం ఏమో కానీ..రకరకాలుగా ఉపమానాలను ముందుకు తెచ్చి..ఏం ఆ మాత్రం కష్టపడలేరా..ఈ మాత్రం సుఖం త్యాగం చేయలేరా అంటూ త్యాగరాజుల బిల్డప్స్ ఇచ్చిన రోజు..ఐతే పాపం ఆ తర్వాత సీన్ రివర్సయ్యేసరికి ఒక్కడు కూడా గొంతెత్తలేడనుకోండి..

ఐతే ఇప్పుడు మళ్లీ అదే  పని జరుగుతోంది..ఓ పక్కన దేశంలో సుప్రీంబ్యాంక్ ఇంతవరకూ ఏమీ చెప్పకపోయినా..2వేల రూపాయల నోటు ప్రింటింగ్ ఆగిపోయిందని ఊదరగొడుతున్న చెత్తవెధవల కోసం ఈ రాత..ఐనా ప్రింటింగ్ ఆగిపోతే నీకెందుకు...ఎక్కువ ప్రింట్ చేస్తే నీకెందుకు..కాగితం దొరక్కపోతే నీకెందుకు..ఖర్చు లెక్కువైతే నీకెందుకు..జనాలకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని ఎత్తుకుని హంగామా చేసే వెధవలారా..నిర్ణయాత్మక శక్తి ప్రకటించనంతవరకూ మీకు ఈ విషయంలో పని లేదు. ముందే ఇచ్చా వార్త అని చెప్పుకోవడంలో నీకు ఏంట్రా తృప్తి..మారండ్రా...లేకపోతే..మానసిక రోగాలతో ఆస్పత్రులలో చేరిపోతారు తొందర్లో..

Comments