ఎన్నాళ్లీ..మూకుమ్మడి దాడి..మా తెలుగు ప్రేక్షకులను రక్షించేవాళ్లే లేరా..ఈ వారసుల నుంచి


అసలేంటంట..ఈ దాడి..ఇప్పటికే ఉన్న హీరోలకే జేబుల్లో డబ్బులు తగలేసుకుని చస్తుంటే..ఇలా ప్రతి ఫ్యామిలీ నుంచి ఇద్దరేసి హీరోలను దింపేస్తుంటే..తట్టుకునేది ఎలాగ..ఆయా హీరోల కుటుంబాలకు అభిమానులకు ఈ రాత..ఈ కథనం వళ్లు మండించవచ్చు కానీ..కేవలం రెండే రెండు కుటుంబాల హీరోలు కనీసం డజను మంది ఇండస్ట్రీలో ఉన్నారంటే వారసుల హవా ఎలా సాగుతుందో తెలీడం లేదా..ఒకప్పుడు ఒక కొడుకుని హీరోగా పరిచయం చేయాలంటేనే నానా తంటాలు పడేవారు..జనం మెచ్చకపోతే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు..ఆ తర్వాత వాళ్లు కూడా తెరపైకి రాకుండా..తెరవెనుకకే వెళ్లేవాళ్లు.. 
బాలయ్య కొడుకు తులసీరాం, కృష్ణ కొడుకు రమేష్ ఇందుకు ఉదాహరణ. ఐతే రమేష్ ని పాపం కృష్ణ చాలా ట్రై చేశాడు కానీ..అతగాడు మనమీద దయతలిచాడు అనుకోండి..కానీ ఇలా ఏళ్లకి ఏళ్లు వరసగా దాడి చేస్తూ..ఏదో గుడ్డేటున ఆడితే..చాలు రెమ్యునరేషన్లు పెంచేసి..ప్రొడ్యూసర్లతో చెడుగుడు ఆడుకునే హీరోలకు లేదా రేషన్..తప్పదా మనకీ పరేషాన్..
అవ్..అనొచ్చు..నీకేం నొప్పి మేం మా డబ్బు పెట్టి తీసుకుంటే..అని..ప్రతి వ్యాపారంలో కాంపిటీషన్ ఉండాలి..కానీ మోనోపలికి పాల్పడుతూ తమ వస్తువులే అమ్ముడయ్యేలా కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తే..వారిపై కాంపిటీషన్ కమిషన్  ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది జరిమానా వేస్తుంది..కానీ మరి ఇండస్ట్రీలో మాత్రం అలా వేయరా 
నందమూరి తారకరామారావు గారి విషయమే తీసుకుంటే..ఆయన వారసులలో బాలకృష్ణ..హరికృష్ణ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. కానీ వారిలో హరికృష్ణ పార్ట్ టైమ్ మాత్రమే ప్రేక్షకులపై దాడి చేశారు..కానీ మంచి పేరే వచ్చిందాయనకు..బాలకృష్ణ ఎన్టీఆర్ అంత పేరు తెచ్చుకోలేదు కానీ..టాప్ హీరో అయ్యారు ఆ తర్వాత ఎన్టీఆర్ పేరుతో సినిమా తీసేవరకూ కూడా ఎదిగారనుకోండి.. కానీ ఆ మాత్రం బ్యాలెన్స్ తర్వాతి తరంలో తప్పిపోయింది..ఎన్టీఆర్  కల్యాణ్ రామ్, తారకరత్న, చైతన్యకృష్ణ బరిలో దిగారు..వారిలో ఎన్టీఆర్ మాత్రమే మొదట్నుంచీ సక్సెస్ బాటలో సాగాడు..కల్యాణ్ రామ్ మాత్రం ఇప్పటికీ ఏడాదికి మూడు చొప్పున పరాజయాలు మిగిల్చుకుంటూ ఆఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు..తారకరత్న రికార్డు ఎవరూ బీట్ చేయలేరు..వదిలేద్దాం

స్వయంకృషితో మగమహారాజుగా ఎదిగి..గ్యాంగ్ లీడరైనా,,ఘరానామొగుడైనా నేనే బిగ్ బాస్ నంటూ హిట్లర్‌లా తెలుగు చిత్రసీమలో శంకర్ దాదా అన్పించుకున్న చిరంజీవికీ తమ్ముళ్లని పరిచయం చేద్దామనే అభిలాషతో  ఓ ఫైన్ మాణింగ్ తమ్ముడు నాగేంద్రబాబు ఉరఫ్ నాగబాబుని హీరోని చేశాడు..కానీ అతడు మాత్రం మంచి నటుడిని అయితే చాలనుకున్నాడు. ధన్యోస్మి అనుకునేలోపే..ఇక్కడా చిన్నతమ్ముడున్నాడంటూ పవన్ కల్యాణ్ దిగబడిపోయాడు..వరసగా హిట్లతో చెలరేగిపోయి..పంజా దెబ్బ రుచి చూపించాడు..శభాష్ అన్పించుకున్నాడు..ఇంతవరకూ ఓకే..కానీ ఇంతలోనే బావని చూసిన బావమరిదికి బావగారూ  ఇదేం బావోలేదు ఎప్పుడూ మీ తమ్ముళ్లేనా హీరోలు..నా కొడుకునీ చేస్తానంటూ గంగోత్రితో అల్లు అర్జున్ ని హీరో చేశాడు..అతని తమ్ముడు శిరీష్ నీ గౌరవంగా పరిచయం చేశాడు..మరి చిరు ఊరుకుంటాడా..ఇదిగో నా చిరుతనయుడంటూ రామ్ చరణ్ ని దింపేశాడు..ఆ తర్వాత నాగబాబు ఆయన కొడుకు వరుణ్ తేజ్‌ని పరిచయం చేశాడు..ఈయనగారికి గత ఏడాదే మంచి గుర్తింపు వచ్చేసింది..ఫిదా..తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2తో ఇక పర్లేదు అన్పించుకున్నాడు..చాల్రా బాబూ ఇంతమందా అనుకుంటుండగానే పదేళ్ల క్రితం దిగిన బుల్లెట్  సాయి ధరమ్ తేజ్ నా తమ్ముడిలోనూ హీరో ఎలిమెంట్ ఉందంటూ ఇదిగో ఇవాళ హీరోగా పరిచయం చేసేసాడు..చూశారుగా ఫోటోలు..
ఊరుకోవాలే కానీ..వీళ్ల నాన్నని కూడా ఏదోక క్యారెక్టర్లో దింపేస్తారేమో..అంటే వెరసి..ఈ మెగా కాంపౌండ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, , అల్లు అర్జున్, శిరీష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయ్ ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్..8మంది హీరోలట..వీళ్లు భూమి బద్దలైనా హీరో క్యారెక్టర్లే చేస్తారు..(ఒక్క నాగబాబు తప్ప) ...ఇఁకో మూడేళ్లు పోతే..పవన్ కల్యాణ్ రేణూదేశాయ్ కొడుకు అకీరాని దింపేస్తారు..ఇప్పటికే మరాఠీలో దింపేశారు కూడా..



ఇక అక్కినేని ఫ్యామిలీలోనూ అంతే నాగార్జున, సుమంత్ మిగిలితే..నాగచైతన్య, అఖిల్,,సుశాంత్ ఐదుగురు హీరోలు..వెంకట్ జెంటిల్మెన్ కాబట్టి..నా కొడుకు హీరో కాడు..కాడు అని చెప్పి మాటకి కట్టుబడ్డాడు..
పైన చెప్పిన 8మంది ఇక్కడ ఐదుగురు మొత్తం పదమూడు..నందమూరి హీరోలను కలిపితే పదిహేనుమంది..ఇప్పుడు చెప్పండి..ఈ ఇండస్ట్రీలో కొత్త హీరోలకు ఛాన్సులు ఎవరయ్యా ఇచ్చేది..ఎవరో పదేళ్లకో సారి వచ్చే హీరోలను చూపెట్టకండి..ఎందుకంటే..వాళ్ల కెరీర్ ఎన్నాళ్లుంటుందో గత చరిత్ర చూసి అప్పుడు వాదించండి..
రాజా..ఉదయ్ కిరణ్,  విజయ్ దేవరకొండ, నిఖిల్, శర్వానంద్, సందీప్ కిషన్ వీళ్లలో ఎవరికైనా పదేళ్లు హిట్ లేకుండా బండి లాగించారా..లాగించగలరా...? అదీ మా వంశాల దెబ్బ 

Comments