రవితేజకి సూటయ్యే టైటిల్


డిస్కోరాజా...
సూపర్ టైటిల్ ఇది..జనం రెచ్చిపోయి డ్యాన్సులాడే..డిస్కోకి..రాజా అనే టైటిల్ తగిలించడంతోనే ఇదెవరికి సూట్ అవుద్దో వెంటనే ఊహించేస్తాం..రవితేజకి కరెక్ట్ టైటిల్..సరిగా తీస్తే..రాజా ది గ్రేట్..ఎలాగోలా తీస్తే..నేలటిక్కెట్..రెండే రెండు ముక్కల్లో రవితేజ కెరీర్‌కి సూటయ్యే డైలాగ్ ఇది.. వరసగా హిట్లు కొట్టినా..చతికిలబడినా..తన చరిత్ర తానే
లిఖించుకునే హీరో రవితేజ.
టాలెంట్ తక్కువ కాదు..అలాని కొత్తగా ఏం చేయడు..డ్యాన్సుల్లో ఎనర్జీ తగ్గదు..కానీ వయసు మీద పడుతోంది..ఫైట్లు చేస్తాడు..కానీ జనం ఇప్పుడు వాటిమీద పెద్దగా మోజు చూపించడం లేదు..తనతో పాటు..తన కన్నా ముందు వచ్చిన హీరోలు ఫేడౌట్ అయిపోయినా..రవితేజ మాత్రం ఇంకా హీరోనే..బహుశా రిటైర్ కూడా అలానే అవ్వాలనేది అతని ప్లాన్ కావచ్చు..కానీ కాలం కొట్టే దెబ్బలకు సూపర్ స్టార్లుగానే కెరీర్ ఎండ్ చేయడానికి అందరూ రజనీకాంత్‌లు కాలేరు. అలా అని కమల్ హసన్‌లానూ చేయలేరు..

యువతరం హీరోలు..నాని, శర్వానంద్, నిఖిల్..అఖిల్, సందీప్ కిషన్..విజయ్ (డి) వరుణ్ తేజ్, సాయి థరమ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు..వాళ్లంతా ఒకసారి కాకపోతే తర్వాత తమ టాలెంట్ తో జనాలని అలరిస్తున్నారు..రవితేజతో వచ్చిన (అటూ ఇటూగా) శ్రీకాంత్, జగపతి బాబు వేరే వేషాలకు రెడీ అయ్యారు..జేడీ చక్రవర్తిలాంటి వాళ్లు సోదిలో లేకుండాపోయారు..రాజశేఖర్ ఇఁకా తేల్చుకోలేదు. ఇన్ని ఈ క్వేషన్ల మధ్య కూడా రవితేజ సినిమాలకు ఓ క్రేజ్..ఇప్పటికీ  ఉంది..కానీ విజయ్ దేవరకొండ అనే హీరో ఈ హీరో స్పేస్ ని ఆక్రమించుకోబోతోున్నాుడు..ఇలాంటి సమయంలో డిస్కోరాజా అంటూ ఓ ప్రయత్నం మొదలైంది..హిట్ కొడితే..ఓకే..కానీ తిరిగి అదే ట్రెండ్ లో సినిమాలు తీయడమే అతని తప్పు..కానీ అలాంటి సినిమాలతోనే హిట్ కొడతాడు..తిరిగి అలాంటి సినిమాలతోనే చతికిలబడతాడు..కానీ ప్రయత్నించకపోవడమనేది లేకుండా లేదు..అందుకే రవితేజ..ఇప్పుడు డిసైడ్ అవ్వాలి..వాట్ నెక్స్ట్ అనేది

Comments