ఇదిగో మోడీ గద్దె దిగడం ఖాయమంటూ వచ్చిన ఫస్ట్ సర్వే


రెండు సర్వేలు విడుదల అయ్యాయ్..రెండూ ఒకటి యూపిఏ అనుకూలంగా..ఒకటి ఎన్డీఏకి అనుకూలంగా ప్రీ పోల్ రిజల్ట్స్ ని చూపించడం విశేషం. అందులో మొదటగా ఇండియా టుడే కార్వీ ఇన్‌సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ సంగతే చూసుకుంటే..ఇందులో ఎన్డీఏ తనకి 2014లో వచ్చిన 336 సీట్ల నుంచిఏకంగా 99 సీట్లు కోల్పోయి 257 సీట్లకి పరిమితం అవుతుందని సూచించింది. యుపిఏకి మాత్రం 59సీట్లు పెరిగి 272 మంది ఎంపీలను గెలిపించుకుంటుందని తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ఈ సిచ్యుయేషన్ వస్తుందని సూచించింది. అలానే ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కాని పార్టీలు 140 స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 35 శాతం, యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని అంచనా.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సర్వే ఫలితాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. రెండోసారి అధికారం దక్కించుకోవాలన్న మోదీ-షా ద్వయానికి ఈ అంచనాలు షాక్‌ ఇచ్చాయి. అయితే ఎన్డీఏ, యూపీఏతో జట్టు కట్టే పార్టీల ఆధారంగా ఫలితాలు మారే అవకాశముంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 272. ఎన్డీఏ, యూపీఏలో భాగస్వాములు కానీ పార్టీలు దేనికి మద్దతు ఇస్తే ఆ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందని సర్వే ద్వారా స్పష్టమైంది.

ఇక రిపబ్లిక్ టివి సీ ఓటర్ సర్వే విషయానికి వస్తే..ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సర్వే ఫలితాలు చెప్తూ..కావాలనే ఎన్డీఏ ఓటమి పాలవుతుందనే విషయాన్ని కప్పి పుచ్చుతోంది

Comments

  1. నేను రిమోటాస్త్రము సాయంతో రెండు సర్వేలు చూసాను. రెంటిలో ఒకే పోకడ. తేడా ఒక్కటే: విశ్లేషకులు తమ తమ ఇష్టాయిష్టాలను బట్టి ప్రెజంటేషన్ మార్చారు.

    "యుపిఏకి మాత్రం 59సీట్లు పెరిగి 272 మంది ఎంపీలను గెలిపించుకుంటుందని తేల్చింది"

    కాదండీ India Today సర్వే ప్రకారం యూపీఏకు వచ్చేవి 166 మాత్రమే, అందులోనూ కాంగ్రెస్ కేవలం 97. ద్రముక్ (39?) లేకుంటే యూపీఏ పరిస్థితి అధ్వాన్నమే.

    ReplyDelete
  2. "దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే" అని నిప్పు బాబు గారు సెలవిచ్చారు .

    http://www.andhrajyothy.com/artical?SID=700585

    తమరు లగడపాటితో చెప్పించిన అభూతకల్పనలు అప్పుడే మరిచి పోయారా చెంద్రాలు సారూ?

    ReplyDelete

Post a Comment