తమిళనాడులో హీరోలు లేరు..అంతా జీరోలే


తమిళనాడులో హీరోలు లేకపోవడమేంటి..70వ ఏటకి దగ్గరపడ్డ సూపర్  స్టార్ రజనీకాంత్..అదే వయసులోని లోకనాయకుడు కమల్ హసన్, ముసలి బాడీ బిల్డర్ శరత్ కుమార్, విప్లవనాయకుడు విజయ్ కాంత్, విజయ్, అజిత్, ధనుష్,  విశాల్, సేతుపతి, ఇంకా సంతానం..వరకూ అందరూ హీరోలే..కాదన్నదెవరు..ఐనా సరే ఒక్కడంటే ఒక్కడికి కూడా సరైన దమ్ము లేదు..మగతనం లేదు..ఎస్..ఓ ఆడపిల్లపై ఇండస్ట్రీ అంతా కత్తిగట్టినట్లు వ్యవహరిస్తోంది..ఇది చెప్తున్నా పట్టించుకునే ఓపిక లేదు..పైగా వీళ్లలో నలుగురైదుగురు రాజకీయనాయకులు కూడా..ఇంకో ఇద్దరు పార్టీలు పెట్టుకుంటామని వస్తున్నారు..మరి తమ సినిమాయలోకంలోనే ఓ ఆడపిల్ల తనకి అన్యాయం జరిగింది సామీ..అంటుంటే ఏం చేస్తున్నారో తెలుసా..చెవుల్లో దూది పెట్టుకున్నారు

నా పై దాడి జరిగింది..ఇది నిజం అని చెప్తే..ఎవరైనా చూపిస్తే జాలి చూపించాలి..అదీ అవసరం లేదనుకుంటే..మూసుకుని కూర్చోవాలి..అంతేకానీ..తిరిగి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారిపైనే కక్షగట్టినట్లు వ్యవహరించేవారిని ఏమనాలి..సున్నాలే కదా..సింగర్ చిన్మయి ఇదే అంటోంది..తనని తమిళ ఇండస్ట్రీ వెలి వేసిందని వాపోతోంది.. వైరముత్తు అనే మహానుభావుడు వంటిని తడుముతుంటాడు..వీలైతే పక్కకి రమ్మంటాడు ఇది నిజం అని చెప్తే..సాక్షాత్తూ రజనీకాంత్..ఏమన్నాడో తెలుసా..సాక్ష్యాలు ఉండాలి కదా..ఆధారం లేకుండా ఆరోపణలు ఎలా..? అని ..పోనీ ఆదారాలు లేవనే అనుకుందాం..ఆ తర్వాత ఏం చేయాలి..సదరు సింగర్ పై కక్షగట్టినట్లు కెరీర్ లేకుండా చేస్తే..స్పందించాలా వద్దా..అక్కర్లేదా..మరి నువ్ పాలిటిక్స్ లో ఏం పీకుతావ్

ఎవరిపైనైనో ఆరోపణలు వచ్చాయో..సదరు వైరముత్తు కరుణానిధి విగ్రహావిష్కరణలో రజనీకాంత్ సరసనే కూర్చుని ముచ్చటిస్తూ కన్పించాడు..అదేం తప్పేం కాదే అనేవాళ్లకి..మరి చిన్మయిపై నిషేధం తప్పుగా కన్పించదా..తెలుగురెడ్డి..నడిగర్ సంఘం  అధ్యక్షుడు విశాల్ గారూ..ఇలానే బిహేవ్ చేస్తున్నారు. ఓ వేళ చిన్మయి తప్పుగా ఆరోపణలు చేస్తోంది అనుకుందాం..ఎంక్వైరీ చేయించవచ్చుగా..అదీ చేయలేరా .అందుకే అంటోంది..తమిళనాడులో హీరోలు ఉన్నారా...

Comments