స్పీకర్‌నే మాట్లాడనివ్వని జగన్..కానీ మీరు చేస్తుందేంటి సర్



ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు తనకి అసలైన ఛాలెంజ్ అంటే..సభలో ప్రతిపక్షం..అధికారపక్షం కూడా ఉంటేనే అని వాపోయారు..ఇందులో నిజంగానే వాస్తవం ఉంది..అక్కడికీ జగన్ కి ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా విన్పించుకోవడంలేదని..కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని స్వయంగా చెప్పడం చూస్తే..నిజమే కదా..ఒక్క నాలుగు రోజులు అసెంబ్లీకి వెళ్లి వస్తే ఏం పోతుంది అనుకోకతప్పదు..సభలో నిజంగానే కోడెలగారు ఎంతో బ్యాలెన్స్ డ్ గా ఉన్నట్లే కన్పించేవారు..
అటు సభలో రెండు పక్షాల వాళ్లూ ఎన్ని తిట్లు తిట్టుకున్నా తన పాత్ర తాను బాగానే పోషించేవారు..ఎటొచ్చీ మైకుల దగ్గరే ఈ బ్యాలెన్స్ ఎంత కవర్ చేసినా కన్పించేది కాదని..ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంటుంది. కానీ అసలు సభకి ప్రతిపక్షం ఎందుకు రానని చెప్పిందో తనకి తెలీదని కోడెల చెప్పడమే విడ్డూరం..ఎందుకంటే 23మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి టిడిపి సీట్లలో కూర్చుంటూ..ఆ కండువాలే కప్పుకుని తిరుగుతుంటే..అనర్హత వేటు వేయకుండా..సాకులు చెప్తూ తిరుగుతుంటే..అందుకే వళ్లు మండి ప్రతిపక్షనేత ఆ పిలుపు ఇచ్చి పాదయాత్ర చేసుకున్నాడు..ఇది తెలీనట్లు నటించడం ఎవరూ హర్షించరు..పైగా ప్రతిదీ కోర్టుకే వదిలేస్తే..ఇక మన విజ్ఞత ఏంటి..విచక్షణ అధికారాలు ఏంటి

నిన్నగాక మొన్న రాజీనామాలు చేసిన రావెల, ఆకుల సత్యనారాయణ రాజీనామాలు మాత్రం ఎలా వెంటనే ఆమోదించగలుగుతారు..ఎన్నికలు రావని తెలిసేనా..ఇక్కడ మాత్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకూ రైటే మనస్సాక్షులే చెప్తాయ్..మంత్రిపదవుల్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు..వైఎస్సార్సీపీ వారే..రేపెటూ సైనిడై ..అని చెప్పేరోజున..సభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరపున ఉన్నారో చెప్పక..ప్రకటించకతప్పదు కదా..మరి ఇంత నిర్భయంగా వాస్తవాలు కన్పిస్తుంటే..ఇంకా ప్రతిపక్ష పార్టీని ఎవరైనా అసెంబ్లీకి వెళ్లడం లేదని ఆడిపోసుకోవడంలో అర్దం ఉందా..?







Comments