కేజీఎఫ్ నిజంగానే ఉంది..ఆ హిస్టరీ చూడండి


కర్నాటకలో నిర్మాతలకు కనకవర్షం కురిపించిన కేజిఎఫ్..ఇప్పుడు టాక్ ఆఫ్ ది శాండల్‌వుడ్ తో పాటు..చరిత్ర గురించి కాస్త ఆసక్తి ఉన్నవాళ్లకి కూడా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది..ఏంటీ కేజీఎఫ్..నిజంగా సినిమాలో చూపించినట్లు ఘోరాలు జరిగాయా..మైనింగ్ గనులను సొంతం చేసుకునేందుకు రక్తపాతం..కూలీల నెత్తుటి జీవితాలు..ఇవన్నీ నిజమేనా అన్పించకమానదు.. 

కేజీఎఫ్ ....అంటే...
కోలార్ గోల్డ్ మైన్స్ ..బెంగళూరునుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏరియా సముద్రమట్టానికి 3195 అడుగుల ఎత్తున ఉందంటే ఆశ్చర్యమే..వందేళ్లుగా బంగారం గనులకు ఇది ప్రసిధ్ది..2001లో మూతపడింది.. అసలు దేశంలోనే మొట్టమొదటి పవర్ జనరేషన్ యూనిట్ ఇక్కడే స్థాపించారంటే ఆశ్చర్యపోవాల్సిందే..అది కూడా 1900లో..ఇంకో విశేషం ఉంది..కరెంటే లేని రోజుల్లో ఇక్కడ నిరంతరాయంగా కరెంట్ కేవలం గోల్డ్ మైన్ల కోసమే పని చేసిందే నమ్ముతారా..కర్నాటక లోని కోలార్ జిల్లాలోని ఓ మైనింగ్ రీజియన్..రాబర్ట్ సన్ పేట కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి రాజధాని..ప్రస్తుతం ఇక్కడ భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీల సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. 
వాస్తవానికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇప్పటివి కావు..వెయ్యేళ్ల క్రితమే కన్నడనాట ఉన్నాయని అధారాలున్నాయ్. కోలార్ ప్రాంతాన్ని గంగవంశ రాజులు వెయ్యేళ్లపాటు పాలించారు.
కువలల పురవరేశ్వర బిరుదుతో అప్రతిహతంగా పాలించిన వారి శకంలో కోలారు..తాలకాడు ప్రాంతాలు రాజధానిగా విలసిల్లాయ్. గంగవంశ రాజుల పేరుతోనే ఈ ప్రాంతమంతా గంగావతిగా పిలిచారు కూడా 
1004 సంవత్సరంలో మాత్రం వీరిపై చోళ వంశీయులు ఆధిపత్యం సాధించారు. ఈ ప్రాంతానికి నీలకరిలిచోళ మండలంగా పేరు పెట్టారు. తర్వాత 1117 సంవత్సరంలో హోయసలుల పాలన ప్రారంభమైంది. విష్ణువర్దన రాజు పాలనలో తలకాడు నుంచి చోళులను తరిమికొట్టడం జరిగింది. ఈ వంశంలో ప్రముఖుడైన సోమేశ్వర మహారాజు చనిపోయిన తర్వాత కోలారు ప్రాంతంలో హోయసలులోనే ఆధిపత్యపోరు 
మొదలైంది. రామనాధ యువరాజుకు కోలార్ ప్రాంతం వెళ్లగా మిగిలినది ఇంకో యువరాజుకి వెళ్లింది. ఐతే హోయసలులలోని మూడో బల్లాల ఏలుబడిలో అంతా ఏకమయ్యారు. 2వ శతాబ్దంలో కోలారు ప్రాంతం 
బెంగళూరుని మించిన నగరంగా విలసిల్లింది. హోయసలులను విజయనగరరాజులు ఓడించడంతో..కోలార్ వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిధ్ది చెందేందుకు మార్గం ఏర్పడింది. 1336-1664 మధ్య కాలమంతా 
విజయనగర రాజుల పాలనే సాగింది. అలా విజయనగర రాజులు..ఆ తర్వాత మరాఠా రాజులు..వారి నుంచి టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ గెలుచుకుంటూ రాగా..కోలార్ ప్రాంత వైభవం దశదిశలా వ్యాప్తి చెందుతూ వచ్చింది. అలా చివరికి బ్రిటీషర్ల కాలం వచ్చేనాటికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే బంగారు గని ఉన్నదనే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఈ వెయ్యేళ్ల కాలంలో కోలార్ ప్రాంతం మైసూరు సంస్థానంతో పాటు మహావాలి, కదంబ, చాళుక్యులు, పల్లవులు, వైడుంబులు, రాష్ట్రకూటులు, చోళులు, హోయసలులు..మైసూరు రాజులు పాలనలో తన ఉనికి కాపాడుకుంటూ వచ్చింది. 

 ఎప్పుడైతే బ్రిటీష్ హయాం ప్రారంభమైందో..అప్పుడే ఇక్కడి గనుల్లోని బంగారం తవ్వడం ఎక్కువ అయింది..అసలు వీటి ప్రాశస్త్యం ఎంత గొప్పదంటే..స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని
జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచబ్యాంకు వద్ద రుణం కోరగా..బ్యాంకు తిరస్కరించిందట.దానికి కారణం విలువైన ష్యూరిటీలు చూపకపోవడమే..దానికి ప్రతిగా నెహ్రూ..మా దగ్గర కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయని..వాటిని తాకట్టుగా తీసుకుని అప్పు  ఇవ్వమనగా..వరల్డ్ బ్యాంక్ వెంటనే లోన్ మంజూరు చేసిందట


 ఎప్పుడైతే గోల్డ్ మైన్స్‌కి డిమాండ్ పెరిగిందో..అక్కడ మైనింగ్ కోసం కర్నాటకలోని ధర్మపురి, కృష్ణగిరి తమిళనాడులోని సేలం, సౌత్ ఆర్కాట్, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపూర్ జిల్లా నుంచి కూలీల రాక ప్రారంభమైంది. అలా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చుట్టూ కాలనీలు ప్రారంభమయ్యాయ్. ఐతే ప్రధానంగా అక్కడ నివసించే కుటుంబాలు మాత్రం బ్రిటీష్, ఇంజనీర్లవే. వీరి లైఫ్ స్టైల్ చూస్తే..ఇప్పటి రిచ్ ఫెలోస్ కూడా అసూయ పడాల్సిందే..అప్పట్లోనే గోల్ఫ్ కోర్స్, టెన్నిస్ కోర్ట్, డ్యాన్స్ హాల్, బంగ్లాలు, స్పెషల్ కాటేజ్‌లు..వీరి కోసం ప్రత్యేకమైన కాలేజీలు..స్కూళ్లు కూడా వెలసాయ్. ఇప్పటికీ ఆ భవంతులు చూడొచ్చు. 
అసలు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎలా ప్రారంభమయ్యాయ్. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని మన దేశంలోనే ఉన్నా..మనవాళ్ల దృష్టి దానిపై ఎందుకు పడలేదు..
టన్నుల కొద్దీ బంగారం ఇక్కడ ఉన్నట్లు కనుక్కున్నదెవరు..కనుక్కున్న తర్వాత ఏం జరిగింది..

 అది 1871 సంవత్సరం.. బ్రిటీష్ సైన్యం నుంచి నుంచి రిటైరైన మైఖేల్ ఫిట్జ్ గెరాల్డ్ లావెల్లీ అనే ఐరిష్ సైనికుడు బెంగళూరు కంటోన్మెంట్‌కి నివాసం మార్చుకున్నాడు. న్యూజిలాండ్‌లోని మావోరి యుధ్దాల్లో పాల్గొన్న అతను ప్రశాంతంగా బతికేందుకు ఇండియా వచ్చాడు. ఐతే బుక్ రీడింగ్ హాబీ కావడంతో..1804నాటి ఓ పాత జర్నల్ అతని కంటబడింది. అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రపంచానికి తెలియడంలో 
ముఖ్య పాత్ర వహించింది.  అఁదులో లెఫ్టినెంట్ జాన్ వారెన్ అనే అతను ఇఁడియాలోని కోలార్ ప్రాంతంలో బంగారం గనుల గురించి ప్రస్తావించాడు . 1779లో శ్రీరంగపట్నం వద్ద జరిగిన యుధ్దంలో టిప్పు సుల్తాన్‌ చనిపోయాడు. ఆ యుధ్దంలోనే  ఈ లెఫ్టినెంట్ జాన్ వారెన్ కూడా పాల్గొన్నాడు. ఆ యుధ్దం తర్వాత టిప్పు ఆక్రమించుకున్న రాజ్యాలన్నీ మైసూరు మహారాజా సంస్థానానికి  బ్రిటీషర్లు అప్పగించినా..ఒక్క  కోలార్ ఫీల్డ్ మాత్రం అప్పగించలేదు. దానికీ కారణం ఉందంటారు.
 కోలార్ ప్రాంతంలో నిధి నిక్షేపాలతో పాటు..బోలెడంత బంగారం గనులు ఉండటంతోనే ఆ పని చేయలేదని ప్రచారముంది. ఇదే ప్రచారంలో అనేక కథలు ఈ లెఫ్టినెంట్ జాన్ వారెన్‌ విన్నాడట..దీంతో  ఎవరైతే ఇక్కడ దొరికే పచ్చ లోహాలని తెస్తారో వారికి పెద్ద బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడట. అంతే ఆ ప్రకటన ఇచ్చిన  రెండో రోజుకల్లా చాలామంది గ్రామస్తులు ఎడ్లబళ్లపై మట్టి పోసుకొచ్చారట...అతని ముందు ఆ మట్టిని కడిగి బంగారం చూపించారట..దీంతో వారెన్‌కి మతిపోయింది..అక్కడితో ఆగకుండా వారెన్ ఇంకా బంగారంపై ఆసక్తి పెంచుకున్నాడు..అప్పుడే ఇంకో అద్భుతాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే.. కోలార్ గోల్డ్ నేలలో ప్రతి 56 కేజీల మట్టిలో ఓ గోధుమగింజ దొరకడం.. దీన్నే ముతక పద్దతిలో కాకుండా..ఇంకా ప్రొఫెషనల్స్ చేతిలో పడితే..ఇంకెంత బంగారం తవ్వుకోవచ్చో అనే ఆలోచన వచ్చింది.  అదే విషయాన్ని తన పుస్తకంలో వారెన్ రాసుకున్నాడు..ఆ  పుస్తకాన్నే  మైఖేల్ ఫిట్జ్ గెరాల్డ్ చదివాడు..వెంటనే ఓ ఫైన్ మాణింగ్ ఎద్దుల బండి కట్టుకుని కోలార్‌కి పయనమయ్యాడు. తన పరిశోధనల్లో చాలా ప్రాంతంలో లెక్కలేనంత బంగారం నిక్షేపాలున్నట్లుగా పసిగట్టాడు. కానీ అది తీసెదెలా..అదే సందేహం అతన్ని పట్టి పీడించింది. రెండేళ్లపాటు మదనపడిన తర్వాత అంటే 1873లో మైసూరు మహారాజుకు మైనింగ్ చేయడానికి లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నాడు. అక్కడ బొగ్గు తవ్వుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినా..లావెల్లీ మాత్రం బంగారం కోసం అన్వేషణ సాగించాడు నేను నా అన్వేషణలో విజయం సాధించానా..అది ప్రభుత్వానికీ గొప్ప మేలు కలుగుతుంది లేదంటే..నష్టం నా ఒక్కడిదే..నేను కోరేదల్లా మైనింగ్‌కి కాస్త సాయం..అని మైసూరు కూర్గ్ చీఫ్ కమిషనర్‌కి ఓ లేఖ కూడా రాశాడు. అలా లావెల్లీకి 20 ఏళ్ల మైనింగ్ లీజు దొరికింది..1875, ఫిబ్రవరి 2 నుంచి లావెల్లీ అనే ఐరిష్ రిటైర్ట్ సోల్జర్ గోల్డ్ హంట్..ఇండియాలోని కోలార్ ఫీల్డ్స్‌లో అలా మొదలైంది

Comments