వైఎస్..కాంగ్రెస్ సొత్తా..మెయిప్పన్ ఇక మెయిల్ ఎక్కండి


అదే కన్ఫ్యూజన్..అదే స్ట్రాటజీ..ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ కాదని..ఓ దేశ్ కీ నేతా కడపలో వాదించడం చూస్తే నవ్వు పుట్టించకమానదు.. ఆ లీడరు స్థాయి ఏమిటన్నది పక్కనబెడితే..ఈ రోజుకీ ఏ నియోజకవర్గంలో ఏ లీడరుకి సీటు ఇవ్వాలో..ఇస్తే అతను తీసుకుంటాడో లేదో..అన్నీ జరిగి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పుకోలేని పరిస్తితి..అందులోనూ బద్దవిరోధి టిడిపితో పొత్తు పెట్టుకుని తరించిన ఘనతా పక్క రాష్ట్రంలో వెక్కిరిస్తూనే ఉంది..ఇలాంటి సందర్భంలో ఇక అన్ని దారులూ తమవే అనుకుని చెప్పుకుంటే కాస్త జనంలో పరువు దక్కుతుందనుకుంటున్నారేమో కానీ..వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ కాదన్నంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మళ్లుతారా..?

2009లో వైఎస్ మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ గుర్తుండే ఉంటాయి కదా..ఓదార్పు చేస్తానంటే అది వద్దు..అందరినీ ఓ చోట చేర్చుదామని హైకమాండ్ చెప్పిందని..వినకపోతే పార్టీనుంచి సస్పెండ్ చేసిందని జగన్ చెప్పటం ..తర్వాత ఆయనపై టిడిపి-కాంగ్రెస్ శంకర్రావ్ ని ముందు పెట్టి కేసు పెట్టడం సిబిఐ ఎంక్వైరీ చేసేసి జైల్లో పెట్టేంతవరకూ విశ్రమించలేదు..ఈ మధ్యకాలంలోనే ఎంత హంగామా జరిగిందో గుర్తుండే ఉంటుంది..వైఎస్ హయాంలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి..కాబట్టి జగన్ ఏ1 అంటూ 11 చార్జ్ షీట్లు వేసారు..అప్పట్లో టిడిపితో ధీటుగా కాంగ్రెస్ నేతలూ రాజశేఖర్ రెడ్డిని విమర్శించారు..

ఈ నేపధ్యంలో వైఎస్ స్కీముల వలన ప్రయోజనం పొందినవారు కానీ..ఆయన అంటే అభిమానం ఉన్నవారు కానీ..లేదూ వైఎస్ వర్గం వారు కానీ..జగన్ మోహన్ రెడ్డివైపు నిలిచారు..ఈ క్రమంలో 16 మంది ఎమ్మెల్యేలనుంచి 63 మంది ఎమ్మెల్యేలవరకూ పెరిగాడు జగన్. ఎవరు అవునన్నా..కాదన్నా..జగన్ ఇవాళ ఏపీలో ప్రబలమైన రాజకీయశక్తి..గెలుపోటముల సంగతి పక్కనబెడితే..కులప్రాతిపదికన అధికారం కోరుకునే ఓ బలమైన వర్గానికి ప్రతినిధి..అలాంటప్పుడు వైఎస్ వారసుడు జగన్ కాదని చెబితే..నవ్వుకోక ఏం చేస్తారు..పైగా ఈ మాట ఎప్పటికప్పుడు వీరప్పమెయిలీ..దిగ్విజయ్ సింగ్..గులగులాం నబీ అజాద్..నుంచి అందరూ వ్యూహాత్మకంగా ఎత్తుకుని భంగపడ్డవారే..పైగా ఇలా చేయడం వలన అది వైఎస్సార్ కాంగ్రెస్ కే బలం కానీ..మీకు కాదు..సర్జీ..అందుకే ఇక మెయిల్ వచ్చేసింది ఎక్కేసి వెళ్లి ఢిల్లీలో తొంగోండి బాస్

Comments