నాగ్ చురకలు బాలయ్యకేనా


అక్కినేని నాగార్జున..నందమూరి బాలకృష్ణ..ఇద్దరూ భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోలు..వంశాభిమానులు కూడా ఎక్కువే..ఐతే బాలయ్య వయసులో చిన్న కానీ...అనుభవం మాత్రం నాగార్జున కంటే ఎక్కువ.  ఎందుకు వచ్చాయో తెలీదు కానీ..ఈ ఇద్దరి మధ్యా మాటలు లేవని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది..ఇద్దరూ కలిసిన వేదికలపై మాత్రం ఇద్దరూ అలాంటివేం లేవని చెప్తుంటారు. వాళ్ల మాటలు నమ్మాలి. ఎందుకంటే..ఎవరిపై ప్రచారం జరుగుతుందో వాళ్లే స్వయంగా వివరణ ఇచ్చినప్పుడు కూడా  నమ్మకపోతే మన మాటలకు విలువ ఉండదు..(ఆధారాలు ఉండవు కాబట్టి)
కానీ మళ్లీ నాగార్జున మాటలు ఈ ప్రచారం ఊపందుకోవడానికి దోహదపడుతున్నాయ్. అక్కినేని నాగేశ్వరరావ్ బయోపిక్ గురించి అడిగినప్పుడు, మాకంత ధైర్యం లేదు..ఎందుకంటే..బయోపిక్ తీసి అది ఫ్లాప్ అయితే దాన్ని తట్టుకోవడం మావల్ల కాదు అన్నారు..అంటే ఇది బాలయ్యని ఉద్దేశించే అన్నారని అంటారు. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయింది కాబట్టి దానిపై కామెంట్ చేశారని అంటున్నారు..వాస్తవానికి నాగార్జున కామెంట్ లో నిజాయితీ ఉంది..కానీ అదే సమయంలో తప్పించుకునే ధోరణీ ఉంది.. ఓ బయోపిక్ ని శ్రధ్దగా చక్కగా తీస్తే..అది ఎందుకు  ఫెయిల్ అవుతుంది..ఓ వేళ  ఫెయిల్ అయినా కూడా..ప్రతి సినిమాని జయాపజయాల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు కదా...నిర్మాతగా డబ్బులు రాబట్టుకోవడం ఎలానో ఈ రోజున ఎవరికైనా ఈజీనే..శాటిలైట్ రైట్స్, కేబుల్ రైట్స్, కి తోడు డిజిటల్ రైట్స్ కూడా వచ్చాయి..ఇలాంటి సందర్భంలో నష్టపోవడమనేేది తక్కువ..

బాలయ్య మరీ మొండిగా ఎన్టీఆర్ తీసారని..పైగా ఏదో తక్కువ సమయంలో పూర్తి చేసి ఘనత సాధించాలనే కొంతమంది తపన కూడా ఇందుకు కారణమని అంటారు..బయోపిక్ అనే కాదు..ఏ సినిమా అయినా ఇంతే సమయంలో తీయాలనే ఆత్రం ఉండకూడదు..ఉంటే..ఏదోక విషయంలో రాజీ పడతారు..ఇది నిర్మాతలకే  ఎక్కువ తెలుసు.అలాంటప్పుడు ఇప్పుడు సినిమా పోయిందని దిగులుపడటం ఎందుకు

నాగ్-బాలయ్య మధ్య మాటలు ఇప్పుడే కాదు..అఖిల్ సినిమా రిలీజై పోయినప్పుడు కూడా ..బాలయ్య కావాలనే- నా కొడుకు ఎంట్రీ ఏదో ప్రపంచాన్ని రక్షించే పాత్రలో అవ్వాలనేం లేదు అంటూ కామెంట్ చేశాడంటారు..వీళ్లద్దరి మధ్యా తేడాలకు నాగేశ్వరరావ్ అంత్యక్రియలకు బాలయ్య వెళ్లకపోవడమే నిదర్శనంగా చూపేవారు ఉంటారు..ఐతే  ఒకటే రంగం అయినంత మాత్రాన ప్రతి సందర్భంలో కలుసుకుంటూ..జనాలకు దర్శనం ఇస్తారని ఆశించడం తప్పు..

Comments